ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు లాంగ్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం కొత్త వడ్డీ రేట్లు మార్చి 10, 2022 నుండి అమలులోకి వచ్చాయి. మూడేళ్లు, ఆ పైన కాలపరిమితి లాంగర్ టర్మ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 5.20 శాతం నుండి 5.45 శాతానికి పెంచింది. అయితే ఇతర వడ్డీ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులేదు.
ఏడు రోజుల నుండి 14 రోజులు, 15 రోజుల నుండి 29 రోజులు, 30 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 3.40 శాతం వడ్డీ రేటు చొప్పున అందిస్తోంది. 46 రోజుల నుండి 60 రోజులు, 61 రోజుల నుండి 90 రోజులు కాలపరిమితిపై 3.90 శాతం చొప్పున, 91 రోజుల నుండి 120 రోజులు, 121 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 4.40 శాతం చొప్పున వడ్డీ రేటును, 180 రోజుల నుండి 269 రోజులు, 270 రోజుల నుండి 1 ఏడాది లోపు కాలపరిమితిపై 4.90 శాతం వడ్డీ రేటును, ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 5.15 శాతం, 444 రోజులపై 5.20 శాతం వడ్డీ రేటు, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.20 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మూడేళ్లు, అంతకుమించి కాలపరిమితిపై మాత్రం 5.20 శాతం వడ్డీ రేటు నుండి 5.45 శాతానికి పెంచింది.

కొటక్ మహీంద్రా బ్యాంకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ వడ్డీ రేటును పెంచింది. వివిధ కాలపరిమితిలపై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఏడు రోజుల నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటును 3 శాతం నుండి 5.8 శాతం అందిస్తోంది. 7 రోజుల నుండి 30 రోజుల కాలపరిమితిపై 2.5 శాతం, 31 రోజుల నుండి 90 రోజులు 2.75 శాతం, 91 రోజుల నుండి 120 రోజులు 3 శాతం, 365 రోజుల నుండి 389 రోజుల మధ్య కాలపరిమితిపై 4.9 శాతం నుండి 5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వివిధ కాలపరిమితులపై వడ్డీ రేటును 5 శాతం వరకు పెంచింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications