Fixed Deposits: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్..

ప్రభుత్వ రంగ బ్యాంకైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 444 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల (bps) వరకు పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు నవంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. నాన్-కాలబుల్ (మధ్యలో ఉపసంహరించుకునే అవకాశం లేని) డిపాజిట్లపై ఇకపై 6.85% వడ్డీ లభిస్తుంది. అలాగే కాలబుల్ (మధ్యలో ఉపసంహరించుకునే అవకాశం ఉన్న) డిపాజిట్లు, NRE (నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను 6.75 శాతానికి సవరించారు. బ్యాంక్ అసెట్-లయబిలిటీ కమిటీ (ALCO) సమీక్ష తర్వాత ఈ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నారు.

దీనివల్ల రూ.3 కోట్ల లోపు విలువ కలిగిన 444 రోజుల కాలబుల్ టర్మ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 6.60% నుంచి 6.75%కి పెరిగింది. రూ.1 కోటి కంటే ఎక్కువ మొత్తంతో చేసే 444 రోజుల నాన్-కాలబుల్ టర్మ్ డిపాజిట్లపై ఇకపై వార్షికంగా 6.85 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 444 రోజుల NRE టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటును 6.60% నుంచి 6.75 శాతానికి చేర్చింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. దీనితో వారికి 444 రోజుల కాలబుల్ టర్మ్ డిపాజిట్లపై మొత్తం 7.25 శాతం వడ్డీ చెల్లిస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.75 శాతం వడ్డీ లభిస్తుంది. తద్వారా వారికి 444 రోజుల కాలబుల్ టర్మ్ డిపాజిట్లపై వార్షికంగా 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.

FD

ఇతర కాలపరిమితులు కలిగిన కాలబుల్, నాన్-కాలబుల్, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై, అలాగే ఎన్ఆర్వో (నాన్-రెసిడెంట్ ఆర్డినరీ) రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేయలేదు.
ఉదాహరణకు ఒక సాధారణ పెట్టుబడిదారుడు కూయ1 లక్షను 6.67% వడ్డీ రేటుతో డిపాజిట్ చేస్తే, వారికి దాదాపు రూ.7,000 వడ్డీ లభిస్తుంది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్లు ఇదే మొత్తాన్ని పెట్టుబడి పెట్టినట్లయితే వారికి దాదాపు రూ.7,500, సూపర్ సీనియర్ సిటిజన్లు రూ.7,800 వడ్డీ వస్తుంది. ఒక సాధారణ పెట్టుబడిదారుడు రూ.3 లక్షలను 6.67 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ చేస్తే, వారికి దాదాపు రూ.20,600 వడ్డీ లభిస్తుంది. అదే మొత్తంతో సీనియర్ సిటిజన్లు రూ.22,400, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.23,200 వడ్డీ వస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+