FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించిన మూడు బ్యాంకులు..

సురక్షితమైన కచ్చితమైన రాబడి కోసం చాలా మంది ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతారు. అయితే బ్యాంకులు అప్పుడప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. తాజాగా దేశంలోని మూడు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును సవరించాయి. ఇండియన్ బ్యాంక్, యూనియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. వడ్డీ రేట్ల సవరణ తర్వాత డీసీబీ బ్యాంకు సాధారణ పౌరులకు 7 .5 శాతం వడ్డీ రేట్ ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 11 నుంచి అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది.

ఇండియన్ బ్యాంక్ సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం సాధారణ పౌరులకు 2.8 శాతం నుంచి 6.65 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 500 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ ఇస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇండ్ గ్రో 555 రోజుల పథకం ద్వారా ఈ గరిష్ఠ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.5 లక్షలు జమ చేస్తే సాధారణ కస్టమర్లకు రూ.50,900 వడ్డీ ఇస్తుండగా.. ఇక సీనియర్ సిటిజన్లు అయితే రూ.54,700 వడ్డీ ఇస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్ అయితే రూ.56,650 వడ్డీ చెల్లిస్తోంది.

FD

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. ఈ బ్యాంకు సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై 2.7 శాతం నుంచి 6.55 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇక 555 రోజుల టెన్యూర్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు అయితే 7.05 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఇందులో ఒక సాధారణ పౌరులు రూ.5 లక్షలు జమ చేస్తే వడ్డీ రూ. 50,150 వరకు చెల్లిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు రూ.53,970 వడ్డీ ఇస్తోంది.

డీసీబీ బ్యాంక్ ప్రస్తుతం సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.75 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు 24-25 నెలలు, 34-35 నెలలు, 60-61 నెలల టర్మ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 8 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు తెవిపింది. 24 నెలల కాలానికి చూసుకుంటే ఒక సాధారణ డిపాజిటర్‌కు 7.50 శాతంతో రూ.5 లక్షలు జమ చేస్తే రూ. 73,900 వడ్డీ చెల్లిస్తోంది. అదే ఒక సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 8.05 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తే చేతికి రూ. 5,79,300 వరకు వస్తాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+