నాకెందుకు క్రెడిట్ కార్డు? నేను డెబిట్ కార్డుతోనే బాగున్నాను!" అని చాలా మందిలో ఓ మానసిక భావన ఉంటుంది. ఆఫర్‌లో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాము, కానీ వాడటం మానేస్తాం. కొన్ని నెలల తర్వాత అది డ్రాయర్‌లో నిద్రపోతూ కనిపిస్తుంది. కానీ అసలేంటో తెలుసా? మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే... వాడకంలో లేని క్రెడిట్ కార్డు కూడా మనపై ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా బ్యాంకులు ఓ ఖాతాదారుని క్రెడిట్ హిస్టరీ చూసే సమయంలో, "ఈ వ్యక్తికి క్రెడిట్ కార్డు ఉన్నా వాడడం లేదు" అనే సమాచారం కనిపిస్తుంది. కొన్నిసార్లు, వాడకంలేకుండా ఉంచిన కార్డులు బ్యాంకులే మూసేస్తాయి. కానీ ఈ మూసివేత మనకు తెలియకుండానే జరగొచ్చు. మన క్రెడిట్ స్కోర్ మీద కొట్టొచ్చేలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఓవర్‌ఆల్ క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది, దాంతో స్కోర్ తగ్గే ప్రమాదం ఉంటుంది.
క్రెడిట్ కార్డును వాడకపోతే, "ఏమీ జరగదు" అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ నిజానికి, వాడని క్రెడిట్ కార్డు వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముందుగా చెప్పుకోవాల్సింది, బ్యాంకులు 6 నుండి 12 నెలలపాటు వాడకపోయిన కార్డులను "ఇనాక్టివ్"గా ప్రకటించి, కొద్ది రోజులకి మీకు నోటీసు కూడా లేకుండా ఆ కార్డును పూర్తిగా మూసేస్తాయి. ఇది మీకి ఊహించని సమయాల్లో ఇబ్బందిని కలిగించవచ్చు.
అంతేకాదు, ఈ చర్యలు మీ సివిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మీ మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గిపోతే, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరుగుతుంది. దాంతో స్కోర్ తగ్గుతుంది. భవిష్యత్తులో మీరు హోం లోన్, పర్సనల్ లోన్, వాహన రుణం తీసుకోవాలనుకున్నప్పుడు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది.
కొన్ని క్రెడిట్ కార్డులకు యానువల్ చార్జీలు ఉంటాయి. అలా వాడకపోయినా వాటిని కట్టకపోతే ఆ ఫీజులు పెనాల్టీలుగా మారతాయి. లేట్ ఫీజులు, ఇంట్రెస్ట్ చార్జీలు వేసి వాడనిది కూడా అప్పుగా మారుతుంది. మీరు ఒకవేళ వాడకం లేని కార్డులను అధికారికంగా మూసేయాలి. లేదా ఓ చిన్న రీఛార్జ్ చేయడం, అమెజాన్‌లో చిన్న ఆర్డర్ పెట్టడం వంటివి చేసి టైముకి బిల్లు కట్టేసినట్లయితే స్కోర్ మెరుగవుతుంది, కార్డు యాక్టివ్‌గా ఉంటుంది, చార్జీలు రాకుండా ఉంటుంది.
ఇకపై ఇలా చేయండి:
మీరు వాడకపోతే ఏ క్రెడిట్ కార్డైనా, దాన్ని మౌనంగా వదిలేయకుండా, బ్యాంకుతో అధికారికంగా సంప్రదించి క్లోజ్ చేయించాలి. ఎందుకంటే, వాడకపోయినా కొన్ని కార్డులకు యానువల్ ఫీజులు, ఇతర చార్జీలు వర్తించవచ్చు. వాటిని గమనించకపోతే, మీకు తెలియకుండా బాకీలు పెరిగిపోతాయి. అందుకే, ప్రతి నెలా కనీసం రూ. 100 నుంచి రూ. 200 వరకు చిన్నచిన్న లావాదేవీలు చేసి, సమయానికి బిల్లులు చెల్లించాలి. దీన్ని అలవాటు చేసుకుంటే, కార్డు యాక్టివ్‌గా ఉంటుంది, స్కోర్ కూడా మెరుగవుతుంది. అంతేకాదు, మీ చేతిలో ఉన్న ప్రతి కార్డు ప్రయోజనాలపై స్పష్టత ఉండాలి. దాని యానువల్ ఫీజు ఎంత? మీరు దాన్ని నిజంగా వాడతారా? లాభం చేస్తుందా? అనే అంశాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. చివరికి ఒక విషయం వాడకపోయిన ఆర్థిక సాధనాలు కూడా మన ఫైనాన్షియల్ హెల్త్‌పై ప్రభావం చూపుతాయి. కనుక నిర్లక్ష్యం కాకుండా, అవసరం లేదనిపించినప్పుడు బాగా పరిశీలించి, జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవడం అవసరం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications