For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ప్రభుత్వ స్కీంలో మంచి రిటర్న్స్: రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే రూ.1390 చేతికి..

|

పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) కూడా ఉంది. మీరు రాబోయే రోజుల కోసం పెట్టుబడి పెట్టాలని భావిస్తే కనుక పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకాల్లో మీరు కచ్చితంగా మంచి రాబడిని పొందగలరు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టిన డబ్బు కూడా పూర్తి సురక్షితం. ఏదైనా బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఆ బ్యాంకు డిఫాల్ట్ అయితే మీకు రూ.5 లక్షల ఇన్సురెన్స్ మాత్రం ఉంటుంది. కానీ పోస్టాఫీస్ స్కీమ్ అలా కాదు. అలాగే, పోస్టాఫీస్ స్కీమ్‌ను చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు ప్రస్తుతం 6.8 శాతంగా ఉంది. వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన సమ్మేళనం చేయబడుతుంది. ఈ మొత్తం మెచ్యూరిటీ పైన చెల్లిస్తారు. ఈ వడ్డీ రేటు ఏప్రిల్ 1, 2020 నుండి వర్తిస్తుంది. ఇందులో రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్ల తర్వాత రూ.1389.49 చేతికి వస్తుంది.

పెట్టుబడి.. క్లోజింగ్

పెట్టుబడి.. క్లోజింగ్

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో కనీసం రూ.1000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఖాతా మెచ్యూరిటీ పీరియడ్ అయిదేళ్లు. డిపాజిట్ చేసిన తేదీ నుండి ఇది ఉంటుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అయిదేళ్ల కంటే ముందు క్లోజ్ చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే క్లోజ్ చేయవచ్చు. ఖాతాదారుడు మృతి చెందినప్పుడు లేదా జాయింట్ ఖాతాదారులు అందరూ మృతి చెందినప్పుడు క్లోజ్ చేయవచ్చు. అలా కాకుండా కోర్టు ఆదేశాలపై కూడా క్లోజ్ చేయవచ్చు.

పన్ను మినహాయింపు ప్రయోజనం

పన్ను మినహాయింపు ప్రయోజనం

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో ఒక వయోజన, ముగ్గురు పెద్దలు ఉమ్మడిగా ఖాతాను తెరువొచ్చు. అలాగే మైనర్ తరఫున గార్డియన్ తెరువొచ్చు లేదా వీక్ మైండ్ వ్యక్తి తరఫున సంరక్షకులు తెరువవచ్చు. ఈ పథకం కింద పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తన పేరు మీద ఖాతాను తెరువొచ్చు.

ఈ చిన్న పొదుపు పథకంలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది.

English summary

ఈ ప్రభుత్వ స్కీంలో మంచి రిటర్న్స్: రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే రూ.1390 చేతికి.. | In this government scheme, with better interest rate, Also get the benefit of tax exemption

National Savings Certificate (NSC) is also included in the small savings schemes of the post office. Let us know about this scheme in detail.
Story first published: Sunday, January 16, 2022, 9:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X