పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)... రిస్క్ లేని రాబడిని మంచి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లలో ఒకటి. అంతేకాదు, రిస్క్ లేని రాబడికి ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాను తెరిచిన మూడో, ఆరో ఆర్థిక సంవత్సరం మధ్య పీపీఎఫ్ ఖాతా నుండి రుణం పొందవచ్చు. అయితే పీపీఎఫ్ నుండి పాక్షిక ఉపసంహరణ సౌకర్యం ఏడో సంవత్సరం నుండి అనుమతించబడుతుంది. ఉన్నత విద్య లేదా వైద్య చికిత్స వంటి వివిధ కారణాలతో అయిదేళ్ల తర్వాత పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా క్లోజ్ చేసే వెసులుబాటు ఉంది. ఇంటరెస్ట్ రేట్ అస్యూర్డ్. కానీ ఇది ఫిక్స్‌గా ఉండదు. ఇది పదేళ్ల గవర్నమెంట్ బాండ్ యీల్డ్స్‌కు లింక్ చేసి ఉంటుంది. వడ్డీ రేటు రోజువారీగా మారదు. కానీ ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేటు సవరిస్తారు.

రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి
పీపీఎఫ్ పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అలాగే మంచి రిటర్న్స్ అందించే పథకం. ఇందులో అసలు, వడ్డీ రెండింటి పైనా పన్నును ఆదా చేసుకోవచ్చు. అందుకే దీనిని సేవింగ్స్ కమ్ టాక్స్ సేవింగ్స్ పెట్టుబడిగా పిలుస్తారు. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఈ పథకంలో గరిష్ఠంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అకౌంట్ నిర్వహణ కోసం ఏడాదికి కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. పెట్టుబడి కాలంలో ఆర్జించిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ పథకంలో లోపాలు.. పీపీఎఫ్ పెట్టుబడులకు 15 సంవత్సరాల కాలపరిమితి ఉంది. మెచ్యూరిటీ కంటే ముందే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోలేరు. మెచ్యూరిటీ తర్వాత కూడా అయిదేళ్ల కాలవ్యవధితో ఎలాంటి చెల్లింపులు లేకుండా ఖాతాను కొనసాగించవచ్చు. మెచ్యూరిటీ తర్వాత కూడా ఖాతా ద్వారా పన్నురహిత వడ్డీ పొందవచ్చు.

మూసివేత తప్పనిసరి కాదు
పీపీఎఫ్ ఆర్థిక సంవత్సరం ఆధారంగా పని చేస్తుంది. పదిహేనేళ్ల తర్వాత పీపీఎఫ్ ఖాతాను మూసివేసి మొత్తం నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇందుకు ఫామ్-సీని పూర్తి చేసి పోస్టాఫీస్ లేదా పీపీఎఫ్ ఖాతా ఉన్న బ్యాంకుకు ఇవ్వాలి. కాలపరిమితి ముగిసిన తర్వాత ఖాతాను తప్పనిసరిగా మూసివేయాల్సిన పని లేదు. అయిదేళ్లు పొడిగించుకోవచ్చు. ఖాతాదారు జీవించి ఉన్నంత కాలం ఎన్నిసార్లైనా ఖాతాను పొడిగించుకోవచ్చు. ఖాతాను కొనసాగించేందుకు ఫాం-హెచ్‌ను ఇవ్వాలి.
ఖాతా తెరిచిన ఏడో సంవత్సరం నుండి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మొదటి ఆరేళ్లలో ఉపసంహరణకు అనుమతిలేదు. ఏడేళ్ల తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉపసంహరించుకోవచ్చు.

ఎంత ఉపసంహరించుకోవచ్చు
ఖాతా నుండి పాక్షిక ఉపసంహరణ చేసుకోవాలంటే సొమ్ము ఉపసంహరించుకున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి నగదు నిల్వలో 50 శాతం లేదా సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి ముందు సంవత్సరం నాటి నగదు నిల్వలో 50 శాతం, ఏది తక్కువ అయితే దానిని తీసుకోవచ్చు.
పాక్షిక నగదు ఉపసంహరణపై ఎలాంటి పన్ను భారం లేదు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఉపసంహరణలు, ముందస్తు మూసివేతకు అవకాశం లేదు.

రుణం ఎలా.. ఎప్పుడు చెల్లించాలి
పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించిన మూడో ఏడాది నుండి ఆరో ఏడాది వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. రుణం తీసుకునే సంవత్సరం నుండి రెండేళ్లకు ముందు వరకు ఉన్న మొత్తం బ్యాలెన్స్ నుండి 25 శాతాన్ని తీసుకోవచ్చు. ఓసారి రుణం తీసుకున్నాక.. దానిని పూర్తిగా చెల్లించాకే మళ్లీ రుణం తీసుకోవచ్చు. పీపీఎఫ్ నుండి లభించే వడ్డీ కంటే రెండు శాతం ఎక్కువ వడ్డీ ఉంటుంది. మీ పీపీఎఫ్ ఖాతా పైన వడ్డీ 7 శాతంగా ఉందనుకుంటే, మీ రుణం పైన వడ్డీ రేటు 9 శాతంగా ఉంటుంది. మూడేళ్లలో ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఏడేళ్ల తర్వాత రుణం ఇవ్వరు. పాక్షిక ఉపసంహరణకు అవకాశముంది. ద్రవ్యోల్భణం పెరిగితే ఈ పథకంతో కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం కష్టమే. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్కెట్ అనుసంధాన పెట్టుబడి సాధనాలు అధిక రాబడిని అందించవచ్చు. అయితే ఇవి రిస్క్‌తో కూడినవి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications