మీ రుణంపై క్రెడిట్ స్కోర్ ప్రభావం ఎలా ఉంటుందంటే?
మూడంకెల క్రెడిట్ స్కోర్ ఒక రుణగ్రహీత యొక్క రుణ అర్హతకు ప్రతీక. బ్యాంకులు లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ఏవైనా రుణాన్ని మంజూరు చేసేముందు క్రెడిట్ స్కోర్ ద్వారా రుణ చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. రుణదాతలు సాధారణంగా క్రెడిట్ స్కోర్‌ను చూస్తాయి. ఇది క్రెడిట్ బ్యూరోస్ ద్వారా లభిస్తుంది. క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 వరకు ఉంటుంది. సాధారణంగా 700 నుండి 900 వరకు బెస్ట్ స్కోర్‌గా పరిగణిస్తారు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే రుణదాతలు లోన్ డిస్ట్రిబ్యూషన్ అంత వేగంగా, తక్కువ వడ్డీ రేటుతో అందిస్తారు.

వారికి తిరస్కరణ అవకాశాలు ఎక్కువ
క్రెడిట్ స్కోర్ 700 కంటే తక్కువగా ఉంటే రుణ మంజూరును తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు రుణం అందించినా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఏ రకంగా చూసినా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు రుణాలు తీసుకోవడం అతిపెద్ద సవాల్. అధిక క్రెడిట్ స్కోర్ కలిగిన రుణగ్రహీతల నుండి బ్యాంకులకు రిస్క్ తక్కువగా ఉంటుందని, అందుకే రుణదాత డబ్బును కోల్పోయే ప్రమాదం తక్కువగా ఉంటుందని, తక్కువ రిస్క్, తక్కువ వడ్డీ రేట్లలోకి అనువదించబడుతుందని చెబుతున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే ఆ తర్వాత అధిక రుణాలకు వెసులుబాటు కల్పిస్తుంది.

ప్రయోజనాలకు దూరం
రుణగ్రహీతగా మీ క్రెడిట్ స్కోర్ చెల్లింపు హిస్టరీ, క్రెడిట్ వినియోగం, క్రెడియ్ ఏజ్, క్రెడిట్ రకం, మొత్తం క్రెటిట్ ఖాతాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. కాబట్టి రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ముందు క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ మీకు అనుకూల పథకానికి దారితీస్తుంది. ఇది ఉత్తమ బ్యాంకుల ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఉపకరిస్తుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీ క్రెడిట్ హిస్టరీ తగ్గుతుంది. మంచి హోమ్ లోన్ స్కీమ్స్ ప్రయోజనాలను పొందలేరు.

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే
750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే దానిని మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు. రుణాలు వేగంగా రావడం, తక్కువ వడ్డీ రేటుకు రావడం వంటి ప్రయోజనం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణ కాలపరిమితి కూడా కాస్త ఎక్కువగా ఎంచుకోవచ్చు. దరఖాస్తును వెంటనే అప్రూవ్ చేస్తారు. ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలలో డిస్కౌంట్ ఉంటుంది.


Click it and Unblock the Notifications