For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

COVID 19: భయంవద్దు, వీటిలో ఇన్వెస్ట్ చేయండి.. IIT హైదరాబాద్

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ స్కీంలలో ఇన్వెస్ట్ చేసే వారు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ఐఐటీ హైదరాబాద్ స్టడీలో తేలింది. తాము పొదుపు చేసిన పథకాల నికర ఆస్తుల వ్యాల్యూ భారీ మొత్తంలో తగ్గనంత వరకు ఇన్వెస్టర్లు భయపడాల్సిన పని లేదని ఈ నివేదిక తెలిపింది.

<strong>మేమెంతో చేశాం...కానీ: భారత్ FDI కీలక సవరణలపై చైనా అక్కసు</strong>మేమెంతో చేశాం...కానీ: భారత్ FDI కీలక సవరణలపై చైనా అక్కసు

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి మంచిదే

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి మంచిదే

కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్లో నెలకొన్న ఆటపోట్ల ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ మొత్తంలో ప్యాకేజీలు ప్రకటించాయని, ఇవి మేలు చేస్తాయని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ దీర్ఘకాలిక సంపద సృష్టి లక్ష్యంగా ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్ని కొనసాగించడమే మంచిదని తెలిపింది.

ఇలా చేయండి..

ఇలా చేయండి..

ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోకుండా కరోనా ముప్పు తొలగిపోయే వరకు సిస్టమెటిక్ ట్రాన్సుఫర్ ప్లాన్ (STP) పద్ధతిని అనుసరించాలని సూచించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ లిబరల్ ఆర్ట్స్ విభాగం ప్రొఫెసర్ బద్రీ నారాయణ రత్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిప్ పెట్టుబడులు కొనసాగించే అవకాశం ఎక్కువే ఉందని అంచనా వేశారు. కానీ చిన్న ఇన్వెస్టర్లు మాత్రం STPకి మళ్లే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

డబ్బులు వెనక్కి తీయకపోవడమే మంచిది

డబ్బులు వెనక్కి తీయకపోవడమే మంచిది

కరోనా నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని, దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అస్థిరతలో ఉందని చెబుతున్నారు. కానీ తమ పెట్టుబడుల వ్యాల్యూ భారీగా పడిపోతే తప్ప భయపడాల్సింది లేదని తెలిపారు. స్వల్పకాలిక ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లలో అస్థిరతతో సంబంధం లేకుండా మ్యూచువల్ ఫండ్స్ నుండి ఇన్వెస్టర్లు డబ్బులు వెనక్కి తీయకపోవడమే మంచిదని చెబుతున్నారు.

English summary

COVID 19: భయంవద్దు, వీటిలో ఇన్వెస్ట్ చేయండి.. IIT హైదరాబాద్ | IIT Hyderabad study analysis on MF investors

A study on Mutual Funds by the Indian Institute of Technology-Hyderabad said investors need not panic as long as the net asset value (NAV) of their investment drastically does not fall during the present quarter.
Story first published: Tuesday, April 21, 2020, 16:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X