SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.1000 తో రూ.1,68,900 మీ సొంతం..!
సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేయాలని చాలా మంది భావిస్తారు. అయితే కొంత మంది తక్కువ మొత్తంలో సంపాదిస్తారు. ఇంత తక్కువలో పొదుపు ఎలా అని ప్రశ్నిస్తుంటారు. తక్కువ మొత్తంలోనైనా పొదుగు చేసే అవకాశం ఉంది. పోస్టాఫీస్, పలు బ్యాంకులు చిన్న మొత్తాల పొదుపు పథకాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ పొదుపు పథకాలు సురక్షితం, పైగా కచ్చితమైన రాబడి వస్తుంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య తరగతి, తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం రికరింగ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరిచి చిన్న మొత్తాల్లో పొదుపు చేయవచ్చు.
రికరింగ్ డిపాజట్ పథకంలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో రిస్క్ ఉండదు. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేదు. సురక్షితమైన, కచ్చితమైన రాబడి ఉంటుంది. రోజువారీ కూలీ అయిన ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. పథకం మెచ్యూరిటీని మనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక సంవత్సరం నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మీకు నచ్చినట్లుగా కాల పరిమితిని ఎంచుకోవచ్చు. ఇందులో మీరు నెలనెలా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో వడ్డీ రేట్ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. మీరు ఎస్బీఐ బ్యాంక్ వెళ్లి ఖాతా తెరవొచ్చు లేదంటే ఎస్బీఐ యోనో యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా రికరింగ్ డిపాజిట్ ఖాతా తెరవచ్చు.

ఎస్బీఐ తన రికరింగ్ డిపాజిట్ పథకంలో 6.05 శాతం వడ్డీని చెల్లిస్తోంది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆర్డీ ఖాతా తెరిచి 10 సంవత్సరాల పాటు నెలకు రూ.500 జమ చేశారనుకుంటే.. మీరు సంవత్సరానికి రూ.6000 వేలు పెట్టుబడి పెడతారు. 10 సంవత్సరాల్లో రూ.60,000 పెట్టుబడి పెడతారు. 10 ఏళ్ల తర్వాత మీకు రూ.84,500 వస్తాయి. ఇందులో అసలు రూ.60,000 కాగా.. వడ్డీ 24,500 ఉంటుంది. మీరు నెలకు రూ.1000 చొప్పున 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మీకు రూ.1,68,983 వస్తాయి. ఇందులో అసలు 1,20,00 కాగా.. వడ్డీ 48,983 ఉంటుంది. మీరు నెలకు రూ.3000 చొప్పున 10 ఏళ్లు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే.. మీకు రూ. 5,06,966 వస్తాయి. ఇందులో అసలు రూ.3,60,000 కాగా.. వడ్డీ రూ.1,46,966 గా ఉంటుంది.
అయితే రికరింగ్ డిపాజిట్ కంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం బెటరని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో మెచ్యురిటీ పీరియడ్ 15 ఏళ్లు ఉంటుంది. కాగా ఇందులో కనీస పెట్టుబడి రూ.500 ఉండగా.. గరిష్టంగా రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో నెలకు 1000 చొప్పున 15 ఏళ్లు పెట్టుబడి పెడితే.. మీకు రూ.3,25,457 వస్తాయి. ఇందులో పెట్టుబడి 1,80,000 కాగా.. వడ్డీ 1,45,457 గా ఉంది. ఇందులో నెలకు రూ.3000 కడితే.. 15 సంవత్సరాల తర్వాత రూ.9,76, 370 వస్తాయి.


Click it and Unblock the Notifications