Personal Loan Vs Gold Loan: బంగారు ఉన్నప్పుడు.. పర్సనల్ లోన్ తీసుకోవడం వేస్ట్..!
చాలా మంది అప్పులు చేస్తుంటారు. అయితే బయట రూ.2, రూ.3 చొప్పున అప్పులు తీసుకుని తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇప్పుడు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తక్కవ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో రుణాలు తీసుకునేవారు పెరిగాయి. చాలా మంది పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. ఈ పర్సనల్ లోన్లు అను సెక్యూర్డు లోన్లు కాబట్టి వీటిపై వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నవారయితే.. పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి. ఉద్యోగులు అత్యవసరం ఉన్నప్పుడు పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే వారికి పీఎఫ్ ఖాతాలో డబ్బులు కూడా ఉంటాయి.
అత్యవసర సమయాల్లో వాటిలో కొంత మేర విత్ డ్రా చేసుకోవచ్చు. పర్సనల్ లోన్లపై సాధారణంగా 10 నుంచి 22 శాతం వరకు వడ్డీ ఉంటుంది. మీకు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్లు తీసుకుంటే మంచిదే కానీ.. ఎక్కువ వడ్డీకి లోన్లు తీసుకుంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు మీకు కుమారుడి చదువు నిమిత్తం రూ.లక్ష అవసరమయ్యాయి. అప్పుడు మీ పీఎఫ్ ఖాతాలో రూ.3 లక్షల డబ్బు ఉంది. మీరు పర్సనల్ లోన్ కోసం ట్రై చేస్తే వడ్డీ రేటు 12 శాతం అంటున్నారు. అప్పుడు పీఎఫ్ లో కొంత మొత్తం విత్ డ్రా చేయడం ద్వారా మీ అవసరాన్ని తీర్చుకోవచ్చు. అప్పుడు మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సి ఉండదు. కాకపోతే మీరు తీసుకున్న పీఎఫ్ డబ్బుపై వడ్డీ కోల్పోవాల్సి వస్తుంది.

మీకు పీఎఫ్ లో 8.25 శాతం వడ్డీ చెల్లిస్తారు. కానీ మీరు 12 శాతంతో పర్సనల్ లోన్ తీసుకునే బదులుగా పాక్షికంగా పీఎఫ్ విత్ డ్రా బెటర్ అవుతుంది. అయితే పీఎఫ్ డబ్బులు అలానే ఉంచుకోవాలనుకునే వారికి మరో అవకాశం ఉంది. అదే గోల్డ్ లోన్. మీ వద్ద బంగారం ఉంటే.. దాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. బంగారం లోన్ సెక్యూర్డ్ లోన్ కాబట్టి వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. మీరు బ్యాంకుల్లో, ఎన్భీఎఫ్సీల్లో పసిడిని తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవచ్చు. బంగారం రుణాలపై 8.75 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి. ఈ కేసులో మీ వద్ద పీఎఫ్ డబ్బులున్నా లేదా బంగారం ఉన్నా పర్సనల్ లోన్ తీసుకోకపోవడ బెటర్.
పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ తో పోల్చుకుంటే బంగారం రుణాలపై వడ్డీ తక్కువగా ఉంటుంది. పైగా ఇప్పుడు బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వచ్చే లోన్ అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు 22 క్యారెట్ల తులం బంగారం తాకట్టు పెడితే మీకు రూ.70 నుంచి రూ.80 వేల వరకు రుణం వచ్చే అవకాశం ఉంది. పర్సనల్ లోన్ విభాగంలో లోన్ రావాలంటే పే స్లిప్స్ ఉండాలి. క్రెడిట్ స్కోర్ బాగా ఉండాలి. అప్పుడే తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ వస్తుంది. కానీ బంగారం రుణాలు అలా ఉండదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
