అప్పుడు రూ.100 ఇన్వెస్ట్ చేసి ఉంటే నేడు కోట్లు అయ్యేది..! అసలు ఉహించి ఉండరు..

ఒకప్పుడు బిట్ కాయిన్ అంటే కూడా సరిగ్గా తెలిసేది కాదు కానీ ఇప్పుడు బిట్ కాయిన్ ఉంటె లక్షాధికారికి సమానం. కొన్నేళ్ల క్రితం బిట్ కాయిన్ అంటే దేనికి ఉపయోగం, దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచన చేసిన వాళ్ళు ఉండే ఉంటారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం 2009లో బిట్‌కాయిన్ ప్రారంభమైంది. మొదట్లో బిట్‌కాయిన్ ధర దాదాపు సున్నా, అంటే దీనికి పెద్దగా విలువ లేదు. దీనిని ఒక ప్రయోగంగా భావించారు. కానీ తరువాత 2010లో ప్రజలు మొదటిసారిగా బిట్‌కాయిన్‌ను ట్రేడింగ్ కోసం ఉపయోగించారు. ఆ టైంలో ఒక బిట్‌కాయిన్ విలువ కేవలం కొన్ని పెన్నీలు(పదులల్లో) మాత్రమే. కానీ క్రమంగా బిట్ కాయిన్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

చివరికి 2024 నాటికి బిట్‌కాయిన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ పొందింది. దీని ధర ఎంతగా పెరిగిందంటే ఒక బిట్‌కాయిన్ ధర దాదాపు $90,000 డాలర్లు దాటింది అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.75 లక్షలకు పైమాటే. ఒక వస్తువు ధర తక్కువ సమయంలో ఇంతగా పెరగడం చాలా అరుదు. మీరు 2010లో బిట్‌కాయిన్‌లో కేవలం రూ. 100 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీరు నేటికి లక్షాధికారై ఉండేవారు. 2010లో బిట్‌కాయిన్కి సుమారు $0.08 ధర నిర్ణయించారు. 2010లో డాలరుతో రూపాయి మార్పిడి రేటు రూ.42. దీని ప్రకారం 1 బిట్‌కాయిన్ రూ.3.38కి సమానం.

If you invested Rs 100 in Bitcoin today you would have got crores see the price change of it

బిట్‌కాయిన్‌లు ప్రారంభ సమయంలో మీరు రూ.100కు 29.58 BTCని కొనవచ్చు. రూ.100 ÷ రూ 3.38 = 29.58 BTC. 26 నవంబర్ 2024 నాటికి బిట్‌కాయిన్ సుమారు $93,379.52 వద్ద ట్రేడవుతోంది. నేడు 1 డాలర్ రూపాయి మార్పిడి రేటు రూ. 84.29. ప్రస్తుత డాలర్ రేటును ఉపయోగించి 1 బిట్‌కాయిన్ ధర $93,379.52 అంటే రూ.78,70,374.27. మీ 29.58 BTC నేటి విలువ: 29.58 BTC × రూ.78,70,374.27= సుమారు రూ. 24 కోట్లు. బిట్‌కాయిన్‌లో మీ మొదటి పెట్టుబడి రూ. 100 అయితే నేడు రూ.24 కోట్లుగా మారేది.

2010లో బిట్‌కాయిన్ మొదటి రియల్-వరల్డ్ ట్రాన్సక్షన్ రెండు పిజ్జాలను కొనడానికి 10,000 BTCని ఉపయోగించారు, ఇది ఫియట్ కరెన్సీ(fiat currency)లో దాని మొదటి విలువను సూచిస్తుంది. 2017 క్రిప్టో బూమ్ సమయంలో బిట్‌కాయిన్ ప్రతి నాణేం $20,000 దాటడం ద్వారా దాని మొదటి మైలురాయిని సాధించింది. 2020-2021 సంవత్సరాల మధ్య టెస్లా అండ్ స్క్వేర్ వంటి కంపెనీల ద్వారా బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెరిగింది. ఈ సంవత్సరం USలో డొనాల్డ్ ట్రంప్ విజయం అలాగే అతని పదవీకాలంలో క్రిప్టో-ఫ్రెండ్లీ విధానాల అంచనాలను అనుసరించి, బిట్‌కాయిన్ కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $95,000కి చేరుకుంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+