PPF Vs EPF Vs VPF: పీపీఎఫ్, ఈపీఎఫ్, వీపీఎఫ్‎లో ఏది బెటర్..!

పదవీ విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే.. ఇప్పటి నుంచి పొదుపు చేయం మొదలు పెట్టాలి. అయితే ఉద్యోగం చేసేవారికి ఈపీఎఫ్ ఉంటుంది. అయితే ఉద్యోగం చేయని వారు కూడా పొదుపు చేసుకునే పథకం ఉంది. అదే పీపీఎఫ్. అలాగే వీపీఎఫ్ కూడా ఉంది. భారత ప్రభుత్వం ప్రారంభించిన PPF, EPF, VPF పథకాల వడ్డీల్లో తేడా ఉంది. ఒక్కో పథకంలో ఒక్కో వడ్డీ రేటు ఉంటుంది.

epf

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)లో భారత పౌరులైన ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. మెచ్యూరిటీ మొత్తం, సంపాదించిన వడ్డీపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పదవీ విరమణ, పన్ను ప్రణాళిక కోసం ఇది అత్యంత సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా ఉంటుంది. దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ బ్యాంకు, కొన్ని ప్రైవేట్ బ్యాంకులలో పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ కార్డు కాపీ, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంకులో నేరుగా కూడా పీపీఎఫ్ (PPF) ఖాతాను తెరవవచ్చు.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)
EPFను 1952 నాటి EPF చట్టం కింద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. PPF భారత పౌరులందరికీ అందుబాటులో ఉండగా, EPF అనేది జీతం పొందే వర్గానికి అందుబాటులో ఉండే ఒక పదవీ విరమణ పొదుపు పథకం. దీనిలో మీరు పదవీ విరమణ సమయంలో ఏకమొత్తం నిధిని అందుకుంటారు. ప్రస్తుత EPF వడ్డీ రేటు సంవత్సరానికి 8.25 శాతంగా ఉంది. ఇది PPF కంటే ఎక్కువ. పాత పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి ₹1.5 లక్షల వరకు ఉద్యోగి వాటాలకు మినహాయింపు ఉంది. రూ.15,000 వరకు మూల వేతనం మరియు కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్) ఉన్న జీతభత్యాలు పొందే వ్యక్తులు తప్పనిసరిగా ఈపీఎఫ్ లో చేరాలి.

వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)
వీపీఎఫ్ అనేది జీతభత్యాలు పొందే ఉద్యోగుల కోసం తీసుకొచ్చారు. ఇది తప్పనిసరి కాని, ప్రభుత్వ మద్దతు గల పెట్టుబడి పథకం. ఈపీఎఫ్ ఉద్యోగి వాటాను 12%కి పరిమితం చేయగా, వీపీఎఫ్ మూల వేతనం, డియర్‌నెస్ అలవెన్స్‌లో గరిష్టంగా 100% వరకు వాటాను అనుమతిస్తుంది. ఈపీఎఫ్, వీపీఎఫ్‌లకు ఒకే వడ్డీ రేటు ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2026కు ఇది 8.25 శాతంగా ఉంది.

ఈ మూడు పథకాల్లో అందరికి ఎంపికగా ఉన్న పథకం పీపీఎఫ్. ఇందులో ఎవరైనా పెట్టుడి పెట్టొచ్చు. వడ్డీ రేటు తక్కువగా అనిపించినప్పటికీ కచ్చితమైన రాబడి ఉంటుంది. ఇందులో మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలుగా ఉంటుంది. ఉద్యోగులకు మాత్రం వీపీఎఫ్ మంచి ఎంపికగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈపీఎఫ్ లో అధిక పింఛన్ కోసం జీతంలో 12 శాతం కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+