IDBI Bank interest rate: ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మారాయి
ప్రముఖ ప్రయివేటురంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) 16వ తేదీ ఆగస్ట్ 2021 నుండి ఫిక్స్డ్ డిపాజిట్స్(FD) పై వడ్డీరేట్లను సవరించింది. ఐడీబీఐ బ్యాంకు రెండు రకాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అందిస్తుంది. ఇందులో సువిథ ఫిక్స్డ్ డిపాజిట్, ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలు ఉన్నాయి. ఈ రెండింటిలోను కనీస డిపాజిట్ మొత్తం రూ.10,000, ఆటో రెన్యూవల్, నెలవారీ, త్రైమాసికం, ఏడాది ఇన్‌కం ప్లాన్స్, సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ రేట్లు, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ, స్వీప్-ఇన్ వంటి అంశాలు ఉన్నాయి. సువిధ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం కింద ఏడు రోజుల నుండి పది సంవత్సరాల పదవీ కాలాన్ని ఎంచుకోవచ్చు. అయితే ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్ స్కీంలో సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు పొందడానికి అయిదు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇటీవల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది.
ఐడీబీఐ బ్యాంకు వడ్డీ రేట్ల సవరణ అనంతరం ఏడు రోజుల నుండి 30 రోజుల కాలపరిమితిపై 2.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 31 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై 2.80 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 46 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై 3 శాతం వడ్డీ రేటు, 91 రోజుల నుండి 6 నెలల కాలపరిమితిపై 3.50 శాతం వడ్డీ రేటు, 6 నెలల నుండి ఏడాది కాలపరిమితిపై 4.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఏడాది కాలపరిమితి వడ్డీ రేటు 5.05 శాతంగా ఉండగా, ఏడాది నుండి రెండేళ్ల మధ్య కాలపరిమితిపై 5.15 శాతం, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 5.20 శాతం, మూడేళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితిపై 5.40 శాతం, అయిదేళ్ల కాలపరిమితిపై (ట్యాక్స్ సేవింగ్ FD) 5.25 శాతం, అయిదేళ్ల నుండి ఏడేళ్ల కాలపరిమితిపై 5.25 శఆతం, ఏడేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.25 శాతం, పదేళ్ల నుండి ఇరవై ఏళ్ల కాలపరిమితిపై 4.80 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
సవరించిన వడ్డీ రేట్లు
- 07-14 days 2.70 శాతం,
- 15-30 days 2.70 శాతం,
- 31-45 days 2.80 శాతం,
- 46- 60 days 3.00 శాతం,
- 61-90 days 3.00 శాతం,
- 91-6 months 3.50 శాతం,
- 6 months 1 day to 270 days 4.30 శాతం,
- 271 days upto- > 1 year - 2 years 5.15 శాతం,
- >2 years to - 3 years to to - 5 years (Tax Saving FD) 5.25 > 5 years - 7 years 5.25 శాతం,
- >7 years - 10 years 5.25 శాతం,
- >10 years - 20 years 4.80.
సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు
- 07-14 days 3.20 శాతం,
- 15-30 days 3.20 శాతం,
- 31-45 days 3.30 శాతం,
- 46- 60 days 3.50 శాతం,
- 61-90 days 3.50 శాతం,
- 91-6 months 4.00 శాతం,
- 6 months 1 day to 270 days 4.80 శాతం,
- 271 days upto- > 1 year - 2 years 5.65 శాతం,
- >2 years to - 3 years to - > 5 years - 7 years 5.75 >7 years - 10 years 5.75 శాతం,
- >10 years - 20 years 5.30
బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లు
- 07-14 days 2.50 శాతం,
- 15-30 days 2.50 శాతం,
- 31-45 days 2.75 శాతం,
- 46- 60 days 2.75 శాతం,
- 61-90 days 2.90 శాతం,
- 91-6 months 2.90 శాతం,
- 6 months 1 day to 270 days 3.00 శాతం,
- 271 days upto- 1 year 3.50 > 1 year - 2 years 3.50 శాతం,
- >2 years to - 3 years to - 5 years 3.75 శాతం,
- > 5 years - 7 years 3.75 శాతం,
- >7 years - 10 years 3.75