ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్స్ హోల్డర్లకు క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం ఇంటర్‌చేంజ్, చెక్ బుక్ ఛార్జీలను ఆగస్ట్ 1వ తేదీ నుండి మారనున్నాయి. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం ఐసీఐసీఐ ఖాతాదారులకు ఆరు మెట్రో నగరాల్లో మొదటి మూడు ట్రాన్సాక్షన్స్ అంటే ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సేవలు ఉచితం. ఐసీఐసీఐ బ్యాంకు నగదు ట్రాన్సాక్షన్స్, ఏటీఎం ఇంటర్‌చేంజ్, చెక్ బుక్ ఛార్జీలు వచ్చే నెల నుండి మారుతున్నాయి.

అదనపు ట్రాన్సాక్షన్‌కు రూ.20
- ICICI బ్యాంకు ఏటీఎంలో నెలకు మొత్తం మూడు ఉచిత నగదు ట్రాన్సాక్షన్స్‌కు అనుమతి ఉంటుంది. ఇది ఆరు మెట్రో నగరాల్లో వర్తిస్తుంది. ఇతర లొకేషన్స్ అయితే మొదటి ఐదు ట్రాన్సాక్షన్స్ ఉచితం. ప్రతి అదనపు ట్రాన్సాక్షన్‌కు ఛార్జీ వసూలు చేస్తారు.
- ప్రతి అదనపు ట్రాన్సాక్షన్ పైన (ఫైనాన్షియల్) రూ.20 ఛార్జీ వసూలు చేస్తారు. నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే రూ.8.50 ఛార్జ్ చేస్తారు.
- ఐసీఐసీఐ బ్యాంకు నెలకు నాలుగు క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కు అనుమతి ఇస్తోంది.

రూ.1000 దాటితే ఛార్జీ
- హోమ్ బ్రాంచిలో నగదు ట్రాన్సాక్షన్ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. ఈ పరిధి దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ ఉంటుంది. కనిష్ఠంగా రూ.150కు లోబడి ఉంటుంది.
- నాన్-హోమ్ బ్రాంచీ అయితే రోజుకు రూ.25,000 వరకు నగదు ట్రాన్సాక్షన్స్ ఉచితం. రూ.25,000 దాటితే రూ.1000కి రూ.5 ఛార్జీ ఉంటుంది. కనీసం రూ. 150కి లోబడి ఉంటుంది.

థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్
- థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ పరిమితి రోజుకు రూ.25,000. రూ.25,000 పరిమితి వరకు ప్రతి ట్రాన్సాక్షన్స్‌కు రూ.150 ఛార్జీ. రూ.25,000 పరిమితికి మించి నగదు ట్రాన్సాక్షన్స్‌కు అనుమతి లేదు.
- ఒక నెలలో మొదటి నాలుగు ట్రాన్సాక్షన్స్‌కు ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత రూ.1000 ట్రాన్సాక్షన్‌కు రూ. 5 ఛార్జీ, కనీసం రూ.150కి లోబడి ఉంటుంది.
- ఒక ఏడాదిలో తీసుకునే 25 చెక్కులు ఉంటే చెక్ బుక్ ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత అదే ఏడాదిలో మొదటి పది చెక్స్‌కు చెక్కుబుక్ తీసుకుంటే బ్యాంకు రూ.20 వసూలు చేస్తుంది.


Click it and Unblock the Notifications