రిటైర్మెంట్ తర్వాత ఖచ్చితమైన ఆదాయాన్ని అందించేందుకు గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ పేరుతో పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్. డిఫర్డ్, ఇమ్మిడియేట్ యాన్యూటీ విధానాలను కలిపి పెట్టుబడులపై ఖచ్చితమైన రిటర్న్స్ అందించే విధంగా దీనిని తీసుకు వచ్చింది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ ప్రకారం ఈ లైఫ్ పెన్షన్ ప్లాన్ పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్లుగా క్రమమైన ఆదాయాన్ని పెంచి ఇచ్చే ఆప్షన్ కలిగి ఉంది. అయిదేళ్ల తర్వాత రెండింతలు, పదకొండేళ్ల తర్వాత మూడింతలు రెగ్యులర్ ఇన్‌కమ్ పెరుగుతుంది.

రెండు రకాల ప్లాన్స్
ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్ పదవీ విరమణ తర్వాత క్రమమైన ఆదాయాన్ని పొందేందుకు యాన్యూటీలు వీలుకల్పిస్తాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఇమిడియేట్ యాన్యూటీలు, డిఫర్డ్ యాన్యుటీ. రెండింటిలోను ఒకదానిని వినియోగదారుడు ఎంచుకోవాలి. ఇమిడియేట్ యాన్యూటీ ఆప్షన్‌ను ఎంచుకుంటే వన్ టైమ్ ప్రీమియంను చెల్లించిన వెంటనే క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. డిఫర్డ్ యాన్యూటీ ఆప్షన్‌ను ఎంచుకుంటే కొంతకాలం వేచిఉన్న తర్వాత యాన్యూటీ పొందే వీలు కలుగుతుంది.

పెన్షన్ ఆప్షన్
ఈ ప్లాన్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జీవితకాలం కచ్చితమైన యాన్యుటీ ఉంటుంది. ఒకసారి ప్రీమియంను చెల్లించి, జీవిత కాలం కచ్చితమైన క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. పదవీ విరమణ తేదీని ఎంచుకునే అవకాశం. కొనుగోలు చేసిన నాటి నుండి యాన్యుటీని తీసుకోవచ్చు లేదా ఒక ఏడాది నుండి పది సంవత్సరాలు వాయిదా వేసుకోవచ్చు. నెలవారీగా, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి.. ఇలా పెన్షన్ తీసుకోవడానికి ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు.

జీవిత భాగస్వామికి ఆదాయం
సింగిల్ లేదా జాయింట్ లైఫ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. సింగిల్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీదారు జీవించి ఉన్నంతవరకు క్రమమైన ఆదాయాన్ని పొందవచ్చు. సింగిల్ లైఫ్ పాలసీ తీసుకుంటే పాలసీదారు జీవించి ఉన్నంత వరకు క్రమమైన ఆదాయం పొందవచ్చు. జాయింట్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీదారు మరణించాక జీవిత భాగస్వామికి ఆదాయం వస్తుంది. మొత్తం 11 రకాల యాన్యుటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మన ఆర్థిక అవసరాలకు తగిన ప్లాన్ ఎంచుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications