ICICI Credit Cards: దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగదారులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. కార్డ్ వినియోగదారులు పెరగటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు అందిస్తున్న వివిధ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మందికి ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ కార్డు హోల్డర్ల సంఖ్య దేశంలో అధికంగానే ఉంది. వారికి సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం ఉంది.
తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రుసుములను మార్చుతున్నట్లు వెల్లడించింది. కొత్త ఛార్జీలు నవంబర్ 15 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ ప్రకటించింది. కార్డులకు సంబంధించిన ఫైనాన్స్ ఛార్జీ, లేట్ పేమెంట్ ఛార్జ్, విద్య కోసం అదనపు లావాదేవీ రుసుము, ఇంధనం కోసం అదనపు లావాదేవీ రుసుములు ఇందులో ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తన ఛార్జీలను క్రమబద్ధీకరించాలని బ్యాంకింగ్ దిగ్గజం నిర్ణయించటంతో ఈ మార్పులు వస్తున్నాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవటంతో తాజా సర్దుబాట్లు వచ్చాయి.

మారుతున్న ఛార్జీల కింద ఇకపై కార్డ్ హోల్డర్లు క్రెడిట్ అండ్ క్యాష్ అడ్వాన్స్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు 3.75% నెలవారీ రేటుతో వర్తిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. ఇది వార్షికంగా 45 శాతం రేటుకు సమానంగా ఉంటుంది. ఇదే క్రమంలో కార్డ్ పేమెంట్ లేటు ఛార్జీలలో బ్యాంక్ మార్పులను ప్రకటించింది. రూ.101-500 మధ్య చెల్లించని బ్యాలెన్స్ విషయంలో ఛార్జ్ రూ.100గా ఉంటుంది. అదే విధంగా చెల్లించని బ్యాలెన్స్ రూ.50 వేలు ఉన్నట్లయితే రూ.1,300గా ఉంటుంది. అలాగే రూ.100 కంటే తక్కువ పెండింగ్ బిల్లు విషయంలో ఎలాంటి లేటు ఫీజు ఉండబోదని బ్యాంక్ వెల్లడించింది.
ఇక ఎడ్యుకేషన్ ట్రాన్సాక్షన్ల విషయంలో నేరుగా స్కూల్ లేదా కాలేజీలకు పేమెంట్ చేసినట్లయితే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని బ్యాంక్ వెల్లడించింది. ఇందులో ఇంటర్నేషనల్ పేమెంట్స్ పై కూడా ఛార్జీలు లేకుండా ఎడ్యుకేషన్ విషయంలో అందిస్తోంది. అయితే థర్డ్ పార్టీ అప్లికేషన్‌ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులపై 1% ఛార్జీ వర్తిస్తుందని పేర్కొంది. ఈ మార్పు బయటి ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన ప్రాసెసింగ్ ఖర్చులను ఆఫ్‌సెట్ చేసేందుకు వసూలు చేస్తున్నట్లు ఐసీఐసీఐ పేర్కొంది.
ఇక యుటిలిటీ అండ్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ల విషయంలోనూ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు ఛార్జీల్లో మార్పులను ప్రకటించింది. యుటిలిటీ చెల్లింపుల విషయంలో రూ.50,000 కంటే విలువైన చెల్లింపు చేసినప్పుడు దానిపై 1 శాతం ఛార్జీ వసూలు చేయాలని బ్యాంక్ కొత్తగా నిర్ణయించింది. ఇదే క్రమంలో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లలో రూ.10,000 కంటే ఎక్కువ లావాదేవీలపై కూడా 1% రుసుము వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
అయితే కొత్త పాలసీ వల్ల కొన్ని ఛార్జీలు ప్రభావితం కావని బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ బ్రాంచ్‌లలో నగదు చెల్లింపులకు ఇప్పటికీ ఒక్కో లావాదేవీకి రూ.100 ఉంటుంది. అయితే ఇంధన సర్‌ఛార్జ్, ఛార్జీల చెల్లింపులు అమెజాన్ పే కార్డ్‌లపై నిర్దిష్ట తగ్గింపుతో లావాదేవీ మొత్తంపై 1% ఛార్జీని కలిగి ఉంటాయి. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఇటీవల ప్రభుత్వ యాజమాన్యంలోని ఎస్‌బీఐ కార్డ్స్ మాదిరిగానే ఫైనాన్స్ చార్జీలను పెంచింది. ఎస్‌బీఐ కార్డ్స్ ఫైనాన్స్ ఛార్జీని నెలకు 3.75 శాతం పెంచగా అవి నవంబర్ 1, 2024 నుంచి అమలులోకి వచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications