ICICI Bank: ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు..!
ఐసిఐసిఐ బ్యాంక్ ఎంపిక చేసిన కాలపరిమితులపై ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు 2026 అక్టోబర్ 23 నుంచి అమలులోకి వచ్చాయి . ఈ మార్పులు రూ.3 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి. మారుతున్న పరిణామాలు, సెంట్రల్ బ్యాంక్ విధానాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ మార్పులను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపొ రేటును పెంచిన తదనంతరం, ఐసిఐసిఐ బ్యాంక్ ఎంపిక చేసిన దీర్ఘకాలిక డిపాజిట్లపై రేట్లను 10 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ పౌరులకు 2.75 శాతం నుంచి 6.60 శాతం వరకు FD వడ్డీ రేట్లను అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లు 7.20 శాతం వరకు వడ్డీ రేట్లు చెల్లిస్తోంది.
ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 నుంచి 45 ఫిక్స్డ్ డిపాజిట్ పై 2.75 శాతం, 46 నుంచి 90 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 4 శాతం, 91 నుంచి 184 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 4.5 శాతం, 185 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.25 శాతం, ఒక సంవత్సరం నుంచి 18 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.30 శాతం, 2 ఏళ్ల నుంచి మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.55 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.60 శాతం, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.60 శాతం వడ్డీ చెల్లిస్తోంది.

ఇక సీనియర్ సిటిజన్లకు 7 నుంచి 45 ఫిక్స్డ్ డిపాజిట్ పై 3.25 శాతం, 46 నుంచి 90 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 4.50 శాతం, 91 నుంచి 184 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ పై 5 శాతం, 185 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పై 6 శాతం, ఒక సంవత్సరం నుంచి 18 నెలల ఫిక్స్డ్ డిపాజిట్ పై 6.75 శాతం, 2 ఏళ్ల నుంచి మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.05 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.20 శాతం, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ పై 7.10 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు, ధృవీకరించబడిన ఆర్థిక సలహాదారు నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.
అత్యధిక రేటు ప్రారంభంలో ఆకర్షణీయంగా, లాభదాయకంగా కనిపించినప్పటికీ, సరైన ఎఫ్డి పెట్టుబడిదారుడి లిక్విడిటీ అవసరాలు, ప్రస్తుత ఆర్థిక వాస్తవికత, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని గమనించడం కూడా చాలా ముఖ్యం. కాగా ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసేటప్పుడు రూ.5 లక్షలకు మించి చేయకూడదని నిపుణులు చూస్తున్నారు. ఒక బ్యాంక్ దివాలా తీసినా మీ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా ఉంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications