ప్రయివేటురంగ ఐసీఐసీఐ బ్యాంకు మంగళవారం ఎమిరేట్స్ స్కైవార్డ్స్‌తో జట్టు కట్టుంది. ఈ రెండు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్‌ను తీసుకు వచ్చాయి. ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు పేరుతో దీనిని తీసుకు వచ్చింది. కస్టమర్లు ప్రయాణం, రోజువారీ జీవనశైలి, రోజువారీ ఖర్చులపై స్కైవార్డ్స్ మైల్స్ అని పిలిచే రివార్డ్ పాయింట్స్‌ను సంపాదించవచ్చు. ట్రావెల్, లైఫ్ స్టైల్, ఎవ్రీడే స్పెండింగ్స్ పైన ఈ రివార్డ్ పాయింట్స్ లేదా స్కైవార్డ్స్ మైల్స్ పొందవచ్చు. ఎమిరేట్స్ స్కైవార్డ్స్‌తో జతకట్టిన తొలి భారతీయ బ్యాంకు ఐసీఐసీఐ కావడం గమనార్హం. ఈ కో-బ్రాండెడ్ కార్డు మూడు వేరియేబుల్స్‌లో లభిస్తుంది.

మూడు రకాల క్రెడిట్ కార్డ్స్
ఐసీఐసీఐ- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ విషయానికి వస్తే ఒకటి... ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఎమిరాల్డ్ క్రెడిట్ కార్డు, రెండు... ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఐసీఐసీఐ బ్యాంకు షిపిరో క్రెడిట్ కార్డు, మూడు... ఎమిరేట్స్ స్కైవార్డ్స్ ఐసీఐసీఐ బ్యాంకు రుబీఎక్స్ క్రెడిట్ కార్డు.

ఎన్నో ప్రయోజనాలు
ప్రతి రూ.100 ఖర్చు పైన 2.5 స్కైవార్డ్స్ మైల్స్ లేదా రివార్డ్ పాయింట్స్ పొందుతారు. వీటిని పార్ట్‌నర్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ టిక్కెట్స్ పైన, విమాన అప్ గ్రేడ్స్, స్పోర్ట్స్ అండ్ సాంస్కృతిక కార్యక్రమాలలో ఆతిథ్యం వంటి రివార్డ్స్ కోసం ఖర్చు చేయవచ్చు.
కాంప్లిమెంటరీ ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సిల్వర్ స్టేటస్‌తో బోనస్ స్కైవార్డ్ మైల్స్ పొందవచ్చు.
బోనస్ స్కైవార్డ్స్ మైల్స్, కాంప్లిమెంటరీ ఎమిరేట్స్ స్కైవార్డ్ సిల్వర్ స్టేటస్, డైనింగ్ ఆఫర్స్ వంటి వాటిని కూడా పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కులినరీ ట్రీట్స్ ప్రోగ్రామ్ ద్వారా డైనింగ్ ఆఫర్స్‌తో పాటు బుక్ మై షో ద్వారా ఎంటర్టైన్మెంట్ ఆఫర్స్, ఎంచుకున్న కార్డు వేరియంట్ ఆధారంగా అనేక ప్రయోజనాలు పొందుతారు.

తమదే ఫస్ట్
ఐసీఐసీఐ బ్యాంకు హెడ్ ఆప్ అన్‌సెక్యూర్డ్ అసెట్స్ సుదీప్త రాయ్ మాట్లాడుతూ... ఎమిరేట్స్ స్కైవార్డ్స్‌తో జత కట్టిన తొలి భారత బ్యాంకు తమదే అని, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు తీసుకు రావడం సంతోషంగా ఉందని, సాధారణంగా క్రెడిట్ కార్డ్స్ సమాన ప్రయోజనాలు అందిస్తాయని అన్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications