2022 జనవరి 1వ తేదీ నుండి ఏటీఎం ఛార్జీలు పెరుగుతున్నాయి. క్యాష్, నాన్-క్యాష్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు పెంచడానికి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతించింది. ఆర్బీఐ అనుమతి నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పరిమితి మించితే ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇతర బ్యాంకులు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
తాజాగా ఐసీఐసీఐ కూడా జనవరి 1, 2022 నుండి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ పెంపు నామమాత్రంగానే ఉంటోంది. ఫైనాన్షియల్,నాన్-ఫైనాన్షియల్ కలిపి కస్టమర్లు ఏటీఎం నుండి ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది.

ఛార్జీ పెంపు
ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఉచిత ట్రాన్సాక్షన్స్ పరిమితి మించితే యాక్సిస్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకు ఏటీఎం నుండి నగదును ఉపసంహరించుకుంటే జనవరి 1, 2022 నుండి రూ.21 చార్జీ వర్తిస్తుందని యాక్సిస్ బ్యాంకు ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.కేంద్ర బ్యాంకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసం రూ.15 నుండి రూ.17కు పెంచుకోవడానికి, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసం రూ.5 నుండి రూ.6కు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఆగస్ట్ 1, 2021 నుండి ఇచ్చింది. అయితే పలు బ్యాంకులు జనవరి 1 నుండి ఈ పెంపును అమలు చేస్తున్నాయి.

ఐసీఐసీఐ కూడా..
కొత్త ఏడాది అంటే 2022 జనవరి 1వ తేదీ నుండి తన బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ పైన సర్వీస్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు ప్రకటించింది. ఏటీఎంలో నగదు ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి కూడా మార్పులు తీసుకుంది. దీని ప్రకారం ఖాతాదారులు ప్రతి నెలలో ఆ బ్యాంకు ఏటీఎంలలో అయిదుసార్లు ఉచిత ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఆ పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేస్తుంది.
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు నగదు ఉపసంహరణకు పరిమితులు విధించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో అయిదుసార్లు ఉపసంహరించుకోవచ్చు. ఈ పరిమితి ఆర్థికేతర ట్రాన్సాక్షన్స్‌కు వర్తిస్తుంది.ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి నగదును ఉపసంహరిస్తే చార్జీలు పెరుగనున్నాయి.

HDFC బ్యాంకు అదే దారి
HDFC బ్యాంకు కూడా పరిమితికి (5) మించి ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మొదటి మూడు ట్రాన్సాక్షన్స్ పైన (ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్) ఛార్జీ లేదు. ఈ పరిమితి మించితే ఛార్జీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు రూ.20 ప్లస్ ట్యాక్స్ ఉండగా, జనవరి 1 నుండి రూ.21 ప్లస్ ట్యాక్స్ ఉండనుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే రూ.8.5 ప్లస్ ట్యాక్స్.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications