Mutual Funds: ఈమధ్య జనాలు పెట్టుబడుల పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే స్టాక్ మార్కెట్లు ఎక్కువ రిటర్న్స్ ఇస్తుండటంతో వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ జనాదరణ పొందుతున్నాయి.
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) తాజా డేటా ప్రకారం.. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు జనవరిలో 20 వేల 634 కోట్లను సేకరించాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే 37 శాతం వృద్ధిని నమోదు చేశాయి. డెట్ ఫండ్‌ల పన్ను రేట్లలో మార్పు తర్వాత ప్రత్యామ్నాయ పెట్టుబడిగా వీటిని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY24) ఏప్రిల్-జనవరి కాలానికి కేటగిరీలో మొత్తం ఇన్‌ఫ్లో 1.21 లక్షల కోట్లకు చేరుకుంది.

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఒక భాగం. ఇవి సాధారణంగా ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల కలయికతోను.. కొన్నిసార్లు బంగారం వంటి ఇతర వర్గాల్లో కూడా పెట్టుబడి పెడతాయి. ట్యాక్స్ రేట్లలో మార్పుల కారణంగా ఏప్రిల్ 2023 నుంచి ఈ వర్గం రెగ్యులర్ ఇన్‌ఫ్లోలను ఆకర్షిస్తోంది. అంతకు ముందు గతేడాది మార్చిలో ఈ సెక్టార్ 12 వేల 372 కోట్ల నికర ఉపసంహరణను చూసింది.
వీటిలోనూ ఆర్బిట్రేజ్ ఫండ్స్ మరియు మల్టీ అసెట్ ఎల్లొకేషన్ ఫండ్స్ అత్యధిక నిధులను ఆకర్షించిన రెండు రకాలు. జనవరిలో హైబ్రిడ్ ఫండ్స్‌లోకి వచ్చిన 20 వేల 637 కోట్లలో.. ఆర్బిట్రేజ్ ఫండ్స్ వాటా 10 వేల 608 కోట్లు కాగా మల్టీ అసెట్ ఎల్లొకేషన్ ఫండ్ సొంతం చేసుకున్న నిధులు 7 వేల 80 కోట్లుగా ఉన్నాయి. పైగా హైబ్రిడ్ కేటగిరీలోని దాదాపు 70 శాతం కేటాయింపులు గత 6 నెలల్లో ఆర్బిట్రేజ్ నిధుల వైపు వెళ్తున్నాయి.
ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలకు పైగా ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్‌లు ఇకపై ఇండెక్సేషన్ ప్రయోజనాలను పొందవు. దీంతో ఇన్వెస్టర్లు తమ స్థిర-ఆదాయ ఎక్స్‌పోజర్‌లో కొంత భాగాన్ని హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications