ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరికి పెద్ద కల. కానీ, భారత మహిళలకు చాలా సులభం ఇప్పుడు ఇది. ప్రభుత్వం మరియు బ్యాంకులు అందిస్తున్న ప్రత్యేక సౌకర్యాల కారణంగా వీటిలో తక్కువ వడ్డీ రేట్లు, ట్యాక్స్ సేవింగ్స్, సబ్సిడీలు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మహిళలకు సొంత ఆస్తి కలిగించడంలో సహాయపడతాయి.

మొదటి ఇల్లు కొనుగోలు చేస్తున్నారా లేదా కో-ఓనర్‌గా జాయింట్‌గా కొనుగోలు ప్లాన్ చేస్తున్నారా, మీకు లభించే ప్రత్యేక సౌకర్యాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
1. తక్కువ హోమ్ లోన్ వడ్డీ రేట్లు:
బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మహిళలకు సాధారణ రేట్ల కంటే 0.05%-0.1% తక్కువ వడ్డీ అందిస్తాయి. చిన్నగా కనిపించినా, 20-25 సంవత్సరాల లోన్ కాలంలో ఇది పెద్ద మొత్తంలో సేవింగ్స్ ఇస్తుంది. SBI, HDFC, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి లెండర్లు మహిళలకు ఈ బెనిఫిట్ ఇస్తూ ఉంటారు, వ్యక్తిగతంగా లేదా కో-అప్లికెంట్‌గా రుణం తీసుకున్నా సరే.
2. తగ్గించిన స్టాంప్ డ్యూటీ:
ఇంటిని రిజిస్టర్ చేసుకునేటప్పుడు ప్రాపర్టీ పై స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో మహిళలకు ఈ డ్యూటీ కొంచెం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఢిల్లీలో మహిళలకు 4% కాగా, పురుషులకు 6% ఉంటుంది. మహారాష్ట్రలో 1% తగ్గింపు ఉంది. హైదరాబాద్ లో మహిళలకు సుమారు 4% మరియు పురుషులకు 5%-5.5% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా మహిళలకు సుమారు 4% మాత్రమే, పురుషులకు 5% చెల్లించాల్సి ఉంటుంది. ఈ తక్కువ రేట్లు ప్రాపర్టీ కొనుగోలు సమయంలో వేలల్లో డబ్బు సేవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.
3. ట్యాక్స్ బెనిఫిట్స్:
ట్యాక్స్ లాభాల విషయంలో, Section 24(b) ప్రకారం ఇంటరెస్ట్ పేమెంట్స్ పై రూ. 2 లక్షల వరకు డిడక్షన్ పొందవచ్చు. అదేవిధంగా, Section 80C ప్రకారం ప్రిన్సిపల్ రీపేమెంట్ పై రూ. 1.5 లక్షల వరకు డిడక్షన్ లభిస్తుంది. ప్రాపర్టీ జీవిత భాగస్వామితో ఉమ్మడిగా ఉన్నా, ప్రతి ఒక్కరు స్వతంత్రంగా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
4. రుణం పొందడం మరింత సులభం:
మహిళలను టార్గెట్‌గా చేసుకుని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సరళమైన డాక్యుమెంటేషన్, ప్రాధాన్యతా ప్రక్రియ, ప్రత్యేక కస్టమర్ సర్వీస్ వంటి సౌకర్యాలు అందిస్తున్నాయి.
5. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) బెనిఫిట్స్:
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) క్రెడిట్-లింక్డ్ సబ్సిడీ పొందడానికి, ప్రాపర్టీలో కుటుంబంలోని మహిళను కో-ఓనర్‌గా రిజిస్టర్ చేయించడం తప్పనిసరి. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల మహిళలు మరియు తక్కువ ఆదాయ వర్గాల మహిళల్లో ప్రాపర్టీ ఓనర్‌షిప్ పెరిగిద్ది. సబ్సిడీ మొత్తం అర్హతపై ఆధారపడి రూ. 2.67 లక్షల వరకు ఉండవచ్చు.
ఈ ప్రత్యేక బెనిఫిట్స్ తెలుసుకుంటే, ఇంటి కొనుగోలు చాలా సులభం అవుతుంది. అలాగే, మీ పెట్టుబడిపై ఎక్కువ లాభం పొందడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇప్పుడు మహిళలకు ఇల్లు కొనడం కంటే సులభం, భద్రతతో, లాభదాయకంగా మారింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications