చాలామంది రకరకాల అవసరాల కోసం లోన్ తీసుకుంటారు. అయితే ఒకవేళ ఆ లోన్ అమౌంట్ మీకు సరిపోని పక్షంలో మీరు అదనంగా మరికొంత లోన్ పొందొచ్చు. దీన్నే టాప్ అప్ లోన్(top up loan) అంటారు. అసలు వీటిని ఎలా ఇస్తారు? ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పటికే రుణం తీసుకున్న వారికి అదనంగా నిధులు ఇచ్చే ప్రాసెస్ ను టాప్-అప్ లోన్స్ అంటారు. వీటిన పొందడం చాలా సులభం. ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఈ లోన్స్ అప్రూవ్ అవుతాయి. సాధారణంగా ఈ సౌకర్యాన్ని అసలు రుణం ఇచ్చిన సంస్థే అందిస్తుంది. దీనివల్ల లావాదేవీలకు సులభంగా ఉంటుంది. కొత్త లోన్ అప్లికేషన్ తో పోలిస్తే.. టాప్-అప్ రుణానికి తక్కువ డాక్యుమెంటేషన్ తో పాటు వేగంగా అప్రూవల్ లభిస్తుంది.
ఎలిజిబిలిటీ
టాప్ అప్ లోన్స్ పొందడానికి చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని రూల్స్ పెట్టాయి. ప్రస్తుతం తీసుకున్న రుణానికి కనీసం ఆరు నుంచి పన్నెండు నెలల EMIలు చెల్లించి ఉండాలి. అప్పుడే ఈ టాప్ అప్ కు అప్లై చేసుకునే వీలుంటుంది.
ప్రయోజనాలివే..
ముందు చెప్పుకున్నట్టుగా ఈ లోన్స్ వేగంగా ప్రాసెస్ అవుతాయి. మీరు ఇప్పటికే మీ PAN, ఆధార్ వంటివి సమర్పించి ఉంటారు. అలాగే మీ పాత EMI పేమెంట్ హిస్టరీ వంటి వివరాలు బ్యాంకుల దగ్గర ఎలాగూ ఉంటాయి. కాబట్టి ఈ లోన్స్ నిమిషాల్లోనే ప్రాసెస్ చేయబడతాయి.
ఇకపోతే ఈ లోన్స్ కు ఎలాంటి హామీ అవసరం లేదు. మీరు కట్టిన పాత EMIలే హామీ కింద పని చేస్తాయి. అలాగే ఈ లోన్స్ ను ఎలాంటి అవసరానికైనా వాడుకోవచ్చు. వడ్డీ రేట్లు కూడా మీ పాత లోన్ వడ్డీ రేట్లను పోలి ఉంటాయి. కొన్నిసార్లు వడ్డీ రేటు తక్కువగా కూడా ఉండవచ్చు. ప్రస్తుతం దేశంలో ఈ తరహా లోన్స్ కు వడ్డీ రేట్లు సంవత్సరానికి 10% నుంచి 14% వరకు ఉన్నాయి.
అప్లికేషన్ ఇలా..
టాప్-అప్ లోన్ పొందాలంటే పాత లోన్ EMI లు కనీసం 6 నెలలు అయినా కట్టి ఉండాలి. అలాగే మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి. అంటే లోన్ EMI లు లేట్ గా కట్టడం వంటివి చేసి ఉండకూడదు. ఇక అప్లికేషన్ విషయానికొస్తే.. టాప్ అప్ లోన్స్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా డిజిటల్‌గానే ఉంటుంది. మీరు బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నేరుగా బ్రాంచ్‌ను సందర్శించి ఆఫ్‌లైన్‌లో కూడా సమర్పించొచ్చు.
ఇలా వాడితే మంచిది
టాప్-అప్‌లను ఎంచుకునే ముందు తమ నెలవారీ బడ్జెట్‌ను జాగ్రత్తగా అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. టాప్-అప్‌లను నిజమైన అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాలి. లోన్ ఇస్తున్నారు కదా అని వృథా ఖర్చులకు వాడితే ఎలాంటి లాభం లేదు. అత్యవసర పరిస్థితుల్లో, వైద్య ఖర్చులకు లేదా ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న అప్పులను ముందుగా తీర్చేయడానికి వీటిని వాడుకోవచ్చు. అయితే టాప్-అప్ తీసుకోవడం వలన మొత్తం అప్పు పెరుగుతుంది కాబట్టి దీనివల్ల EMI పెరగవచ్చు లేదా లోన్ రీపేమెంట్ టెన్యూర్ పొడిగించబడవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications