EPFO: కంపెనీ మారితే పీఎఫ్ ఖాతాను ఎలా బదిలీ చేసుకోవాలి..!

ఉద్యోగం చేసే అందరికీ దాదాపు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఈ పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి నుంచి కొంత సొమ్ము, యాజమాన్యం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. అయితే కొందరు ఉద్యోగులు కంపెనీ మారుతుంటారు. అప్పుడు వారు తమ పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇకపై ఉద్యోగులు తమ పాత సంస్థ వద్ద ఉన్న PF నిల్వలను, ప్రస్తుత సంస్థలోని కొత్త PF ఖాతాకు సులభంగా బదిలీ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. గతంలో, ఉద్యోగులు వేరొక కంపెనీలో చేరినప్పుడు తమ పాత సంస్థ వద్ద ఉన్న పీఎఫ్ డబ్బను కొత్త ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు బదిలీ చేసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉండేది.

అయితే, ఈ కొత్త పీఎఫ్ బదిలీ విధానంతో ఆ ప్రక్రియ చాలా సులభంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుంది. మీరు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు మీ పీఎఫ్ ఖాతాలను బదిలీ చేయడానికి కొన్ని వివరాలు కావాలి. UAN లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉండాలి. ఆధార్ నంబర్, పాన్, లేదా బ్యాంక్ ఖాతా వివరాలు, ఇవి తప్పనిసరిగా మీ UANకు లింక్ చేసి ఉండాలి. మీ పాత, ప్రస్తుత యజమాని ఎస్టాబ్లిష్‌మెంట్ నంబర్, పీఎఫ్ ఖాతా నంబర్ ఉండాలి.
మీరు ఫారం 13ను కూడా ఫిల్ చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే మీ యూఏఎన్ నంబర్ యాక్టివ్ గా ఉండాలి.

pf

ఆధార్, బ్యాంక్ వివరాలు, పాత ఉద్యోగం విడిచిపెట్టిన తేదీ తప్పనిసరిగా UANలో అప్‌డేట్ చేసుండాలి. మీ యజమాని మీ ఇ-కెవైసిని ఆమోదించాలి. ఈ సిస్టమ్ ఒక్కో మెంబర్ ఐడికి ఒక బదిలీ అభ్యర్థనను మాత్రమే అనుమతిస్తుంది. ఆన్ లైన్ పీఎఫ్ ఖాతా బదిలీ చేయాలనుకుంటే.. అధికారిక EPFO వెబ్‌సైట్ (https://www.epfindia.gov.in/)ను సందర్శించి, మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. 'సర్వీసెస్' పై క్లిక్ చేసి, 'ఒక ఉద్యోగి - ఒక EPF ఖాతా'ను ఎంచుకోవాలి.
మీ వ్యక్తిగత సమాచారాన్ని ధృవీకరించుకుని, మీ పాత, ప్రస్తుత యజమాని గురించిన సమాచారాన్ని ఫిల్ చేయాలి. మీ పీఎఫ్ ఖాతా వివరాలను చూడటానికి 'గెట్ డీటెయిల్స్' పై క్లిక్ చేయాలి.

క్లెయిమ్ ఫారమ్‌ను ధృవీకరించడానికి, డిజిటల్ సిగ్నేచర్ (DSC) ఉన్న మీ పాత కంపెనీని ఎంచుకోవాలి. మీ మెంబర్ ఐడి లేదా యూఏఎన్ను టైప్ చేసి, మీ లింక్ చేసి మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) పొందడానికి 'గెట్ OTP' పై క్లిక్ చేయండి. OTPని ఎంటర్ చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అంతే మీరు మీ పీఎఫ్ ఖాతాను ఒక యజమాని నుంచి మరొక యజమానికి మార్చడానికి విజయవంతంగా దరఖాస్తు చేసుకున్నారు. మీ UAN మారనప్పటికీ, ప్రతి యజమాని సాధారణంగా తమ ఉద్యోగులకు వేర్వేరు మెంబర్ ఐడీలను జారీ చేస్తారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+