చాలా మంది క్రెడిట్ కార్డ్స్ డబ్బు అవసరమైన సమయాల్లో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తారు. అయితే క్రెడిట్ కార్డ్స్ లో చాల రకాలు ఉంటాయి. వీటిలో రూపే కార్డ్స్ ని ఇప్పుడు UPIతో ఉపయోగించవచ్చు, ఎక్కువ మంది ఇప్పటికీ వీసా, మాస్టర్ కార్డ్‌లను పాకెట్లో క్యారీ చేస్తుంటారు. మీ దగ్గర క్యాష్ లేని సమయంలో ఈ క్రెడిట్ కార్డ్స్ చాలా ఉయోగకరంగా ఉంటాయి. అలాగే క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి ATM నుండి డబ్బు విత్ డ్రా చేసేందుకు రూల్స్ కూడా ఉన్నాయి. ఇలా చేస్తే కొంచెం అదనపు చార్జీలు ఉంటాయి. అయితే దీనికో సొల్యూషన్ ఉంది...
ATM విత్ డ్రా: చాలా క్రెడిట్ కార్డ్స్ ATM విత్ డ్రా ఫెసిలిటీ అందిస్తాయి. కానీ ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మీ ప్రతి విత్ డ్రాపై సర్వీస్ ఛార్జీలు ఇంకా ఇంట్రెస్ట్ విధించబడవచ్చు. విత్ డ్రా చేసాక మొత్తం డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్: కొన్ని క్రెడిట్ కార్డ్స్ మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ కు డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే ఈ సర్వీస్ మీ కార్డ్‌పై ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. దీని కోసం బ్యాంక్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యాక క్యాష్ ట్రాన్స్ఫర్ సెక్షన్లోకి వెళ్ళాలి. తరువాత సూచించిన విధంగా ఫాలో అవుతూ డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు.
ఇ-వాలెట్ ట్రాన్స్ఫర్: కొత్త పేమెంట్ పద్ధతుల్లో ఇ-వాలెట్ ఒకటి. ఇందుకు ముందుగా మీ ఇ-వాలెట్ యాప్‌కి లాగిన్ అవ్వాలి. యాప్‌లోని పాస్‌బుక్ సెక్షన్ నుండి 'సెండ్ మనీ టు బ్యాంక్' అప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నుండి మీరు ట్రాన్స్ఫర్ అప్షన్ ద్వారా డబ్బు సెండ్ చేయవచ్చు. అయితే ఇందుకు అకౌంట్ నంబర్ ఇంకా IFSC కోడ్ అవసరం కావచ్చు.
ఇతర అప్షన్స్: వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ ఇంకా మనీగ్రామ్ వంటి సర్వీసెస్ ఇతర అప్షన్స్. ఇక్కడ మీరు ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. డబ్బు ట్రాన్స్ఫర్ అకౌంట్కి అనుబంధించిన పేరు ఇంకా దేశాన్ని సెలెక్ట్ చేసుకొండి. ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ద్వారా బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. రిసీవర్ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మని ట్రాన్స్‌ఫర్ పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత మీరు మనీ ట్రాన్స్‌ఫర్ కంట్రోల్ నంబర్ (MTCN)ని ఉన్న కన్ఫర్మేషన్ ఇమెయిల్ వస్తుంది. ఈ రకమైన పేమెంట్ సాధారణంగా 1 నుండి 5 వర్కింగ్ డేస్ లో డబ్బు క్రెడిట్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications