Monthly SIP: గట్టిగా అనుకుంటే రూ. 10 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు! ప్రతి రూపాయిని ఎలా పెంచాలో చూడండి!
చాలామందికి ఒక పెద్ద ఆర్థిక లక్ష్యం ఉంటుంది.. అదే కోట్లలో ఆస్తి సంపాదించడం. వినడానికి రూ. 10 కోట్లు అనేది ఒక భారీ మొత్తంలా అనిపించవచ్చు, కానీ సరైన ప్లాన్ , క్రమశిక్షణ ఉంటే ఇది అసాధ్యమేమీ కాదు. దీనికి ఉన్న అత్యంత సులభమైన మార్గం మంత్లీ సిప్ (monthly sip) సిప్ అంటే.. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఒకేసారి పెద్ద మొత్తం పెట్టాల్సిన అవసరం లేకుండా, ప్రతి నెలా చిన్న చిన్న మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే, దీర్ఘకాలంలో అది కొండలా పేరుకుపోతుంది.

SIP ద్వారా సంపద ఎలా పెరుగుతుంది?
SIPని అందరూ ఇష్టపడటానికి ప్రధాన కారణం 'కాంపౌండింగ్' (చక్రవడ్డీ). మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు మీద వచ్చే లాభం, మళ్ళీ ఇన్వెస్ట్ అవ్వడం వల్ల మీ సంపద రెట్టింపు వేగంతో పెరుగుతుంది. దీనికి తోడు 'రూపీ కాస్ట్ యావరేజింగ్' అనే పద్ధతి వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు వస్తాయి. దీనివల్ల రిస్క్ తగ్గి, దీర్ఘకాలంలో సగటున 12% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ మొత్తానికి ఎన్ని ఏళ్లు పడుతుంది?
ఒకవేళ మీరు సగటున 12% వార్షిక రిటర్న్స్‌ని అంచనా వేస్తే, మీ మంత్లీ సిప్ (monthly sip) అమౌంట్ ని బట్టి రూ. 10 కోట్లు చేరడానికి పట్టే సమయం ఇలా ఉంటుంది..
- నెలకు రూ. 10,000: ఈ మొత్తంతో రూ. 10 కోట్లు చేరడానికి సుమారు 39 ఏళ్లు పడుతుంది.
- నెలకు రూ. 20,000: సుమారు 33 ఏళ్లలో మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
- నెలకు రూ. 50,000: కేవలం 25 నుండి 26 ఏళ్లలోనే రూ. 10 కోట్లు మీ అకౌంట్లో ఉంటాయి.
- నెలకు రూ. 1,00,000: మీరు నెలకు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే, కేవలం 20 ఏళ్లలోనే మీరు మీ గోల్ రీచ్ అవుతారు.
'స్టెప్-అప్ SIP' తో మీ ప్రయాణం మరింత వేగంగా!
మీరు మొదట్లో తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ చేసినా, ప్రతి ఏటా మీ పెట్టుబడిని పెంచుకుంటూ పోవడాన్నే 'స్టెప్-అప్ SIP' అంటారు. ఉదాహరణకు, మీ జీతం పెరిగిన ప్రతిసారీ మీ SIPని 10% పెంచితే, 33 ఏళ్లు పట్టే గోల్‌ని మీరు 26 ఏళ్లలోనే పూర్తి చేయవచ్చు. అంటే దాదాపు 7 ఏళ్ల సమయాన్ని మీరు ఆదా చేయవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
డబ్బు సంపాదించడం అంటే కేవలం ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు, కొన్ని నియమాలు పాటించాలి..
- క్రమశిక్షణ (Consistency): మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా ప్రతి నెలా పెట్టుబడి పెట్టాలి.
- సమయం (Time): మీరు ఎంత త్వరగా మొదలుపెడితే, కాంపౌండింగ్ పవర్ అంత ఎక్కువగా పనిచేస్తుంది.
- సహనం (Patience): మార్కెట్ ఒడిదుడుకులు చూసి భయపడి విత్‌డ్రా చేయకూడదు.
చివరగా చెప్పేది ఏంటంటే.. రూ. 10 కోట్లు సంపాదించడం అనేది రాత్రికి రాత్రే జరిగేది కాదు. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ రోజు మీరు చేసే చిన్న మంత్లీ సిప్ (monthly sip) మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ఆర్థిక ప్రయాణాన్ని మొదలుపెట్టండి.


Click it and Unblock the Notifications