ఇంటర్నెట్ లేకుండా ఆన్‌లైన్ ద్వారా ఇలా డబ్బులు పంపించండి

UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. స్మార్ట్ పోన్ ద్వారా ఒకరి బ్యాంకు ఖాతా నుండి మరొకరికి నగదు ఏ సమయంలో అయినా పంపించగల సదుపాయం ఉంటుంది. నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) అభివృద్ధి చేసిన BHIM యాప్‌తో పాటు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్ పే వంటి ప్రయివేటు యాప్స్ కూడా యూపీఐ చెల్లింపు సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇందుకు ఆయా యాప్స్‌ను మీరు మీ మొబైల్ ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందుకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సదుపాయం అవసరం. కానీ ఫీచర్డ్ ఫోన్, స్మార్ట్ ఫోన్ రెండింటిలోను ఇంటర్నెట్ సదుపాయం లేకుండా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఇందుకు *99#కి డయల్ చేయడం ద్వారా ఈ సేవలు లభిస్తాయి. దీనిని యూఎస్ఎస్‌డీ 2.0గా పిలుస్తారు.

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్

UPI ఆధారిత చెల్లింపులను అందించే యాప్ భీమ్. దీనిని ఎన్పీసీఐ అభివృద్ధి చేసింది. కొన్ని ప్రయివేటు ప్లేయర్స్ పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే కూడా ఉన్నాయి.

యూపీఐ వినియోగించడం కోసం బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. అలాగే, మీ బ్యాంకు యూపీఐ సౌకర్యాన్ని అందించేందిగా ఉండాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంకు, ICICI బ్యాంకులు సహా దాదాపు అన్ని బ్యాంకులు యూపీఐ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. మీ మొబైల్ నెంబర్ బ్యాంకులో రిజిస్టర్ అయి ఉండాలి. వెరిఫికేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది.

41 బ్యాంకుల ద్వారా సేవలు

41 బ్యాంకుల ద్వారా సేవలు

నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకారం *99# సేవల కింద అందించే కీలక సేవలు అకౌంట్ ఫండ్స్‌ను ఇంటర్ బ్యాంకు ఖాతాకు పంపించడం, స్వీకరించడం, బ్యాలెన్స్ విచారణ, యూపీఐ పిన్‌ని సెట్ చేయడం లేదా మార్చడం.

*99# సేవను ప్రస్తుతం 41 ప్రముఖ బ్యాంకులు అందిస్తున్నాయి. అన్ని జీఎస్ఎం సర్వీస్ ప్రొవైడర్లు కూడా అందిస్తున్నాయి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పన్నెండు భాషల్లో యాక్సెస్ కావొచ్చు.

99 సర్వీస్ ఫీచర్స్

99 సర్వీస్ ఫీచర్స్

- మెను ఆధారిత అప్లికేషన్స్‌కు మద్దతిస్తుంది. దీనిని కస్టమర్లు సులభంగా నిర్వహించవచ్చు.

- డేటా కనెక్టివిటీ అవసరం లేదు.

- నిత్యం పని చేస్తుంది. సెలవులు అని లేకుండా 24X7 అందుబాటులో ఉంటుంది.

- ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే టెలికం సర్వీస్ ప్రొవైడర్లు మీకు నామినల్ ఫీజును ఛార్జ్ చేస్తారు. సాధారణంగా ప్రతి *99# సేవ ట్రాన్సాక్షన్‌కు 0.5 శాతం ఉంటుంది. గరిష్ట ఛార్జీ పరిమితి ట్రాయ్ నిబంధనలుక అనుగుణంగా ట్రాన్సాక్షన్‌కు రూ.1.5.

 99 రిజిస్టర్ ఎలా?

99 రిజిస్టర్ ఎలా?

- బ్యాంకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి *99# కు డయల్ చేయాలి.

- మీ బ్యాంకు అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

- మీ డెబిట్ కార్డు చివరి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి.

- ఎక్స్‌పైరీ తేదీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎంటర్ చేసి, యూపీఐ పిన్‌ను కన్ఫర్మ్ చేయాలి. ఈ స్టెప్ తర్వాత ఈ సేవను ప్రారంభించవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా యూపీఐ వినియోగం ఎలా?

ఇంటర్నెట్ లేకుండా యూపీఐ వినియోగం ఎలా?

- ముందుగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి *99# కి డయల్ చేయాలి.

- స్క్రీన్ పైన కనిపించే ఆప్షన్లలో డబ్బు పంపించడం కోసం Send Money ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇందుకు 1 పైన క్లిక్ చేసి, రిప్లైని ఎంచుకోవాలి.

- ఏ ఆప్ష‌న ద్వారా డ‌బ్బును పంపిచాలో ఎంచుకోవాలి. మొబైల్ నెంబర్ అయితే 1, యూపీఐ ఐడీ అయితే 3, సేవ్ చేసిన ల‌బ్ధిదారుని కోసం 4, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కోసం 5 క్లిక్ చేయాలి.

- ఉదాహ‌ర‌ణ‌కు మీరు మొబైల్ నెంబర్ ద్వారా పంపించాలనుకుంటే 1ని డ‌యల్ చేయాలి.

- తర్వాత ఎవరికి పంపించాలనుకుంటున్నారో వారి మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.

- వారి వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ధృవీకరణ తర్వాత ముందుకు వెళ్లాలి.

- వివరాలు సరైనవేనని రూఢీ చేసుకున్నాక మీరు పంపించే మొత్తాన్ని డయల్ ప్యాడ్‌తో ఎంటర్ చేయాలి.

- మీ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిని ధృవీకరించుకోవాలి.

- అన్నీ సరైనవే అయితే యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి.

- డబ్బు బదలీ సక్సెస్ అయ్యాక మొబైల్ నెంబర్‌కు సందేశం వస్తుంది.

- ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్‌ను ముందు జాగ్రత్తగా సేవ్ చేయాలి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+