చాల బ్యాంకులు ప్రతిఒక్కరికి క్రెడిట్ కార్డ్స్ అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ ద్వారా పెద్ద లాభం ఏంటంటే టైంకి అన్ని బిల్స్ కట్టొచ్చు. ఇలా చేయడం ద్వారా లేట్ ఫీ చార్జెస్, ఇంట్రెస్ట్ ఇలాంటి తప్పించుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ కార్డ్ వాడిన తరువాత టైంకి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం. మీ క్రెడిట్ కార్డ్ డ్యూస్ లేదా పెండింగ్ బిల్ క్లియర్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, వాటిలో ఒకటి మరొక క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం. క్రెడిట్ కార్డ్ షాపింగ్, కరెంట్ బిల్, ఆన్ లైన్ పేమెంట్స్ ఇలా ఏదైనా బిల్స్ కట్టడానికి చాల ఈజీ మార్గాలలో ఒకటి. కానీ క్రెడిట్ కార్డు సరిగ్గా ఉపయోగించకపోతే మీపై ఎక్కువ భారం పెంచుతుంది.
మరొక క్రెడిట్ కార్డ్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా కట్టాలి
మీ క్రెడిట్ కార్డ్ బిల్ మరొక కార్డు ద్వారా కట్టడానికి మూడు మార్గాలు ఉన్నాయి. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, UPI అండ్ క్యాష్ అడ్వాన్స్.

బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్
మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి పెండింగ్ ఉన్న క్రెడిట్ కార్డుకి బ్యాలెన్స్‌ని మరొక క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీరు మీ క్రెడిట్ కార్డ్‌లోని బ్యాలెన్స్‌ను మరొక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కట్టొచ్చు. సాధారణంగా మరొక క్రెడిట్ కార్డ్ కోసం బిల్లు పేమెంట్ చేయడానికి తక్కువ వడ్డీ రేటుతో క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలి. అయితే, కార్డు హోల్డర్లు బ్యాలెన్స్‌ని ఒక కార్డు నుండి మరొక కార్డుకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చార్జెస్ పడుతుంది, ఈ చార్జెస్ బ్యాంకు నుండి బ్యాంకుకు మారవచ్చు.
డిజిటల్ వాలెట్లు
డిజిటల్ వాలెట్‌లు సాధారణంగా వాలెట్లోకి మని యాడ్ చేయడానికి ఉపయోగిస్తారు. క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్స్ తో సహా చాలా రకాల పేమెంట్స్ చేయడానికి ఈ వాలెట్‌ను ఉపయోగించవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి మీరు తప్పనిసరిగా మీ డిజిటల్ వాలెట్‌కి డబ్బును యాడ్ చేసుకోవాలి. బ్యాంక్ వెబ్‌సైట్‌లో మీ కార్డ్ అండ్ ఇతర అవసరమైన వివరాలను ఎంటర్ చేయడం ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో మీ డిజిటల్ వాలెట్‌కి ఈజీగా లింక్ చేయవచ్చు. వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఎంటర్ చేసేందుకు బ్యాంక్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపుతుంది. మీ క్రెడిట్ కార్డ్‌ని మీ డిజిటల్ వాలెట్‌కి లింక్ చేసిన తర్వాత, మీరు మీ వాలెట్‌కి డబ్బును యాడ్ చేసి క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్స్ చేయడానికి ఉపయోగించవచ్చు.
క్యాష్ అడ్వాన్స్
మరొక కార్డును ఉపయోగించి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టడానికి క్యాష్ అడ్వాన్స్ మరొక మార్గం. మీరు బిల్లు పేమెంట్ చేయడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ చేయడానికి మీ బ్యాంక్ నిర్ణయించిన క్యాష్ అడ్వాన్స్ లిమిట్ వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేస్తే ATM విత్ డ్రా చార్జెస్ విధిస్తారు. అందువల్ల ఈ పద్ధతి క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఎక్కువ ఖర్చుతో ఉంటుంది.
మొత్తం మీద క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ విధానం కార్డ్ హోల్డర్ల సౌలభ్యం మీద ఆధారపడి ఉంటుంది. మరొక కార్డ్ కోసం పేమెంట్స్ చేయడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించే ముందు క్రెడిట్ లిమిట్, వడ్డీ రేటు ఇంకా రిపేమెంట్ కెపాసిటి గుర్తుంచుకోండి. మీ పెండింగ్స్ క్లియర్ చేయడానికి మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్ ప్రతి మోడ్‌ను అండ్ సంబంధిత ఖర్చులను తప్పనిసరిగా అనాలిసిస్ చేయాలి.


Click it and Unblock the Notifications