మీ SIP ని మరింత పవర్‌ఫుల్‌గా మార్చండి.. తక్కువ టైమ్‌లోనే ఎక్కువ సంపద! టెక్నిక్ ఇదే!
చాలా మంది ఉద్యోగులు లేదా ఇన్వెస్టర్లు ఒకసారి SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) స్టార్ట్ చేశాక దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ప్రతి నెలా అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతుంటాయి, బ్యాక్‌గ్రౌండ్‌లో మార్కెట్ ఎప్స్ అండ్ డౌన్స్ అవుతుంటుంది, పెట్టుబడి అలా ఏళ్ల తరబడి సాగిపోతుంది. అయితే, ఒక సాధారణ పోర్ట్‌ఫోలియోకి, ఒక అద్భుతమైన లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్‌కి మధ్య ఉండే తేడా అదృష్టం కాదు.. కేవలం మన ప్రవర్తన (Behaviour) మాత్రమే! మనం తీసుకునే కొన్ని చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో మనకు వచ్చే లాభాలను పూర్తిగా మార్చేస్తాయి.
మీరు కూడా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని అనుకుంటే, ఈ క్రింది విషయాలను కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే.

ఫుల్ సెటిల్ అయ్యాక చూద్దాం అనుకోవద్దు!
చాలా మంది చేసే మొదటి తప్పు ఏంటంటే.. జీవితంలో బాగా ఆర్థికంగా "కార్ఫర్టబుల్" అయ్యాక ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేద్దాం అని ఆగుతారు. నెలకు రూ.2,000 లేదా రూ.5,000 చిన్న మొత్తమే కదా, దీనివల్ల ఏం లాభం ఉంటుందిలే అని వాయిదా వేస్తుంటారు. కానీ SIP పెట్టుబడులలో మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే, 'కాంపౌండింగ్ పవర్' (చక్రవడ్డీ) అంత అద్భుతంగా పనిచేస్తుంది.
ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులోనే చిన్న మొత్తంతో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన వ్యక్తి.. 35 ఏళ్ల వయసులో భారీ మొత్తంతో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన వ్యక్తి కంటే చాలా ఎక్కువ లాభాలను ఆర్జిస్తాడు. ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ రేటు ఒకటే అయినా, మొదటి వ్యక్తి పెట్టిన డబ్బు మార్కెట్‌లో పెరగడానికి ఎక్కువ సమయం దొరికింది. ప్రారంభంలో ఈ గ్రోత్ చాలా స్లోగా అనిపించినా, లాంగ్ రన్‌లో దీని స్పీడ్ ఊహించలేరు.
జీతం పెరిగినప్పుడల్లా 'స్టెప్-అప్' చేయండి
చాలా మంది ప్రతి సంవత్సరం తమ లైఫ్ స్టైల్‌ను పెంచుకుంటారు, కొత్త సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటారు, ఖర్చులు పెంచుకుంటారు కానీ ఐదేళ్ల క్రితం స్టార్ట్ చేసిన SIP మొత్తాన్ని మాత్రం అలాగే ఉంచుతారు. ఇక్కడే 'స్టెప్-అప్ ఎస్ఐపీ' (Step-up SIP) మ్యాజిక్ చేస్తుంది.
మీ శాలరీ పెరిగినప్పుడల్లా మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని కూడా 10 శాతం చొప్పున పెంచుకుంటూ పోవాలి. ఉదాహరణకు ఈ ఏడాది రూ.5,000 కడితే, వచ్చే ఏడాది దానిని రూ.6,000, ఆ పై ఏడాది రూ.7,000 చొప్పున పెంచాలి. ఇలా చేయడం వల్ల 15 లేదా 20 ఏళ్ల తర్వాత మీ చేతికి వచ్చే ఫైనల్ అమౌంట్ (Corpus) మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
మార్కెట్ పతనం.. ఒక అద్భుతమైన అవకాశం!
మార్కెట్లు భారీగా పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు చాలా కంగారు పడిపోతుంటారు. ఇన్వెస్ట్‌మెంట్‌ను కాసేపు ఆపి, మార్కెట్ స్థిరపడ్డాక చూద్దాం అనుకుంటారు. కానీ నిజానికి మార్కెట్ పడిపోయినప్పుడే మీ SIP చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.
మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు మీరు పెట్టే అదే మొత్తానికి ఎక్కువ 'మ్యూచువల్ ఫండ్ యూనిట్లు' లభిస్తాయి. ఆ సమయంలో మీ పోర్ట్‌ఫోలియో వాల్యూ తగ్గిపోయినట్లు కనిపించినా, భవిష్యత్తులో మార్కెట్ రికవర్ అయినప్పుడు ఈ ఎక్స్‌ట్రా యూనిట్లే మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి.
ప్రతిరోజూ రిటర్న్స్ చెక్ చేయడం ఆపేయండి
మ్యూచువల్ ఫండ్స్ అనేవి క్విక్ రిటర్న్స్ ఇచ్చే ప్రొడక్ట్స్ కావు. ఇవి షార్ట్ టర్మ్‌లో ఒడిదుడుకులకు లోనవుతాయి. కాబట్టి ప్రతి వారం లేదా ప్రతి నెల మీ పోర్ట్‌ఫోలియోను ఓపెన్ చేసి రిటర్న్స్ చెక్ చేయడం వల్ల యాంగ్జైటీ, టెన్షన్ పెరుగుతాయే తప్ప ఎలాంటి లాభం ఉండదు. లాంగ్ టర్మ్ గోల్స్ అయిన రిటైర్మెంట్, పిల్లల చదువు, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటమే బెస్ట్.
స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అయిన ఇన్వెస్టర్లు ఎవరూ ప్రతి నెలా అత్యధిక రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ వెంట పడలేదు. మార్కెట్ క్రాష్ అయినా, బోర్ కొట్టినా సరే క్రమశిక్షణతో తమ SIP ని కొనసాగించిన వారే విజేతలుగా నిలిచారు. కాబట్టి ఓపికగా ఉండండి, సమయానికి దాని పని చేసుకోనివ్వండి.. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే రిజల్ట్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.


Click it and Unblock the Notifications