మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి, అందులో నుండి నెలనెల నిర్దిష్ట మొత్తంలో నగదు ఉపసంహరించుకోవచ్చుననే విషయం మీకు తెలుసా? దీనిని సిస్టమెటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(SWP) అంటారు. మీ ఆదాయ అవసరాలకు అవసరమైన డబ్బును నెల నెల అందేలా SWP పని చేస్తుంది. ఈ విధానం సీనియర్ సిటిజన్స్‌కు ఎంతో ఉపయోగకరం. మీరు నెల నెల ఉపసంహరించుకోగా మిగిలిన మొత్తానికి అప్పటి లాభాలను బట్టి కొద్ది మొత్తంలో డబ్బులు కలుస్తాయి. అవసరమైతే ఉపసంహరణ మొత్తాన్ని పెంచుకునే వెసులుబాటు ఉంది. ఉపసంహరణ తేదీలను నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షికంగా సెట్ చేసుకోవచ్చు.

సిప్‌కు ఆపోజిట్‌గా...
సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)కు ఆపోజిట్ SWP. బ్యాంకు ఖాతా నుండి మ్యూచువల్ ఫండ్‌కు ప్రతి నెల స్థిర మొత్తం క్రమం తప్పకుండా బదలీ కావడాన్ని సిప్(SIP) అంటారు. అదే మ్యూచువల్ ఫండ్ నుండి బ్యాంకు అకౌంట్‌కు నిర్దిష్ట సమయానికి, నిర్దిష్ట మొత్తంలో నగదు బదలీ కావడాన్నే SWP అంటారు. పెట్టుబడిదారు SWP ద్వారా డబ్బులు పొందాలనుకుంటే వారికి చెందిన మ్యూచువల్ ఫండ్ యూనిట్లు రెడీమ్ అవుతాయి. వారి వారి ఖర్చులను చేరుకునేందుకు ఇన్వెస్టర్లకు SWP ఉపయోగపడుతుంది.

అప్పటి వరకు చెల్లింపులు
మ్యూచువల్ ఫండ్ స్కీంలో మీ పెట్టుబడుల నుండి స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా ఉపసంహరించుకోవడానికి SWP మిమ్మల్ని అనుమతిస్తుంది. ఒక ఇన్వెస్టర్ SWPని ఎంచుకుంటే అతను కొన్ని మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను రిడీమ్ చేయడం ద్వారా కొనసాగుతున్న పెట్టుబడి నుండి తన స్వంత డబ్బును క్రమబద్దతిలో స్వీకరిస్తాడు. SWPలో వ్యవధిని ఇవ్వకుంటే మీ హోల్డింగ్‌లో యూనిట్లు మిగిలి ఉన్నంత వరకు SWP ద్వారా చెల్లింపులు కొనసాగుతాయి.

లెక్క ఇలా..
ఉదాహరణకు మీరు ఫండ్‌లో రూ.10 NAVతో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఆ పథకంలో రూ.10,000 యూనిట్లు వచ్చాయి. SWP ద్వారా ఉపసంహరించుకోవాలనుకుంటే మొత్తం రూ.1000 అని అనుకుంటే ఆ ఫండ్‌లో రూ.1000 విలువైన యూనిట్లను రెడీమ్ చేసి, ఆ డబ్బును మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సిప్ ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత SWPని ప్రారంభిస్తే, అప్పుడు ఉపసంహరణ తేదీ నాటికి ఆ ఫండ్ NAV రూ.20 ఉంటే 50 యూనిట్లను విక్రయిస్తుంది. దీంతో యూనిట్ల సంఖ్య రూ.9950కి తగ్గుతుంది. తదుపరి నెలలో చెల్లింపు తేదీ నాటికి NAV రూ.25కి చేరుకుంటే రూ.1000 చెల్లింపుకు ఫండ్ 40 యూనిట్లను విక్రయిస్తుంది. అప్పుడు యూనిట్ల సంఖ్య 9910కి చేరుతుంది. అప్పుడు NAV రూ.20 ఉంటే 50 యూనిట్లు విక్రయిస్తుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications