స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఓ కళ. కేవలం ట్రేడింగ్ ఖాతాను కలిగి ఉండి, ఏదో కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యంతో షేర్లను కొనుగోలు చేయడం, విక్రయించడం ద్వారా రిటర్న్స్ ఉండవు. స్టాక్ మార్కెట్‌లో రాణించడానికి నిర్దిష్ట నైపుణ్యాలు అవసరం. స్టాక్ మార్కెట్ పైన పూర్తి అవగాహన ముఖ్యం. ఈక్విటీ హామీ ఇవ్వని అస్థిర ఆస్తి తరగతి. చాలామంది స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్, ఇన్వెస్ట్ చేయడాన్ని ఎంచుకుంటారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే రిటర్న్స్ రావొచ్చు లేదా రాకపోవచ్చు. వస్తే భారీగా రావొచ్చు. లేదా నష్టపోవచ్చు.

పెట్టుబడికి మార్గాలు
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. క్యాపిటల్ అప్రిసియేషన్ లేదా డివిడెండ్ ఎర్న్డ్. చాలామంది ఎక్కువగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ ధర పెరుగుదల ద్వారా రిటర్న్స్ పొందాలని భావిస్తారు. సానుకూల పరిణామాలు ఉంటే షేర్ ధర పెరిగితే రిటర్న్స్ ఖాయం. అయినప్పటికీ హామీ ఇవ్వలేని రిటర్న్స్ ఇవి. కంపెనీ పనితీరు పేలవంగా ఉంటే షేర్ ధర తగ్గడం సాధారణమే. అందుకే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుండి రాబడిని పొందడానికి మరో మార్గం డివిడెండ్స్. చాలా కంపెనీలు డివిడెండ్స్‌లో వాటాదారులకు మొత్తం లేదా లాభంలో కొంత మొత్తాన్ని పంపిణీ చేస్తాయి. మీరు డివిడెండ్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలలో చాలా షేర్లను కలిగి ఉంటే కచ్చితంగా రిటర్న్స్ వస్తాయి.

ఇలా కొనుగోలు చేయండి
- ట్రేడింగ్ అంటే స్వల్పకాలిక కొనుగోలు అమ్మకం. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం సదరు కంపెనీ, రంగాల గురించి పూర్తి అవగాహనను కలిగి ఉండాలి. పెట్టుబడికి ముందు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా లేక దీర్ఘకాలిక ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా గుర్తించాలి.
- ట్రేడింగ్‌కు ముందు ఆయా రంగం, కంపెనీ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సాంకేతిక, ప్రాథమిక విశ్లేషణల ద్వారా మీరు సరైన స్టాక్స్‌ను ఎంచుకోవాలి.
- తక్కువ ధరకు కొనడం, విక్రయించడం సరైన స్టాక్ మార్కెట్ వ్యూహంలా కనిపిస్తుంది. కానీ స్టాక్ కనిష్టం, గరిష్టాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. మార్కెట్లో కాలాయాపన చేయడానికి బదులు విలువను కలిగించే స్టాక్స్ కొనుగోలుపై దృష్టి సారించాలి.

విభిన్న పోర్ట్‌పోలియోలో
- మీ కొనుగోలు పోర్ట్‌పోలియో విభిన్నంగా ఉండాలి. డబ్బు మొత్తాన్ని ఒకే స్టాక్ లేదా ఒకే రంగంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా విభిన్న పోర్ట్ పోలియోలను రూపొందించుకోవాలి. కొన్ని స్టాక్స్ తక్కువ పని తీరును కనబరిచినట్లయితే మిగిలినవి మీ పోర్ట్‌పోలియోలోని నష్టాలను అధిగమించి బ్యాలెన్స్ చేయవచ్చు.
- స్టాక్స్ ఉత్తాపనపతనాల సమయంలో ఉద్వేగానికి లోను కావొద్దు. స్టాక్స్ ధరలు పడిపోయినప్పుడు ఆవేశపడి విక్రయించడం, ధరలు పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుందనే ఆశతో ఇష్టారీతిన కొనుగోలు చేయడం సరికాదు. కంపెనీ స్థిరత్వం, స్టాక్ లాభనష్టాలకు కారణాలను పరిగణలోకి తీసుకోవాలి.
- ఇతరుల సలహాలు, సిఫార్సుతో స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతారు. ఇతరుల సలహాలు తీసుకోవడంతో పాటు స్టాక్ మార్కెట్ పైన మనకు కూడా అవగాహన ఉండాలి.


Click it and Unblock the Notifications