For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించవచ్చు, పెట్టుబడి సూత్రాలు...

|

పెట్టుబడి లాభదాయకంగా ఉండాలి. అందుకే ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆచితూచి, మన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. స్టాక్ మార్కెట్, బంగారం, క్రిప్టో, రియల్ ఎస్టేట్.. ఇలా ఎందులో ఇన్వెస్ట్ చేసినా సురక్షితంతో పాటు మంచి రిటర్న్స్ వచ్చేలా ఉండాలి. పెట్టుబడులకు సంబంధించి రిస్క్ తీసుకుంటే ఆసురక్షితంగా ఉండవచ్చు. రిస్క్ వద్దనుకుంటే తక్కువ రిటర్న్స్‌తో ప్రభుత్వ ప్రాయోజిత, బ్యాంకింగ్ పెట్టుబడులు ఉంటాయి.

రిస్క్ తీసుకుంటే

రిస్క్ తీసుకుంటే

మీరు ఇరవై సంవత్సరాల వయస్సులో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే అది ఏడాదికి ఇరవై శాతం చొప్పున పెరిగితే కనుక మీకు 65 సంవత్సరాలు వచ్చేసరికి ఆ మొత్తం రూ.99 కోట్లకు చేరుకుంటుంది. అదే రూ.1 లక్ష మీరు మీ ముప్పై సంవత్సరాల వయస్సులో పెడితే మరో రకంగా ఉంటుంది. అందుకే పెట్టుబడి నిపుణులు తక్కువ వయస్సు నుండే పెట్టుబడిని అలవాటు చేసుకోవాలని సూచిస్తారు.

రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాదికి కనీసం ఐదు శాతం చొప్పున రిటర్న్స్ ఉండవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్, సిప్ అయితే రిటర్న్స్ ఎక్కువగా ఉండవచ్చు. కానీ రిస్క్‌తో కూడుకున్నది. కాబట్టి మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే అంశాన్ని బట్టి రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ వద్దనుకుంటే తక్కువ రిటర్న్స్, రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ రావొచ్చు.

కోట్లు చేతికి...

కోట్లు చేతికి...

ఉదాహరణకు ఐచర్ మోటార్స్‌లో ఇరవై రెండేళ్ల క్రితం మీరు రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే అది ఇప్పుడు కోటిన్నర రూపాయల వరకు ఉంటుంది. 1980లో విప్రోలో రూ.10వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు దాని విలువ ఎంతో తెలుసా? రూ.800 కోట్లు. అయితే గత పదేళ్లలో స్థిరంగా 15 శాతం నుండి 50 శాతం లాభాలు ఇస్తున్న కంపెనీల ఉదాహరణలు మాత్రమే. కానీ ఎన్నో కంపెనీలు మంచి రిటర్న్స్ ఇస్తుంటాయి. అయితే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చాలా రిస్క్‌తో కూడుకున్నదని గుర్తించాలి. హఠాత్తుగా కంపెనీ ఇబ్బందుల్లోకి వెళ్తే మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే కంపెనీ చరిత్ర, భవిష్యత్తు ప్లాన్ వంటివి తెలుసుకోవాలి.

పెట్టుబడి సూత్రాలు

పెట్టుబడి సూత్రాలు

- చాలామంది స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే ఇది రిస్క్‌తో కూడుకున్నది. కుటుంబాన్ని, స్నేహితులను పక్కన పెట్టి చాలామంది నిత్యం సంపాదన కోసం చూస్తారు. కానీ సరైన పెట్టుబడి విధానం లేక వారు అలాగే ముందుకు సాగుతారు. కేవలం కష్టపడటమే కాదు, పెట్టుబడికి సరై మార్గాన్ని కూడా ఎంచుకోవాలి.

- మరికొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనుకుంటారు. అప్పుడు తొందరలో ఇష్టారీతిన ఇన్వెస్ట్ చేసేవారు ఉంటారు. అది కూడా సరైన పద్ధతి కాదు.

- మరికొంతమంది పెట్టుబడులు పెడుతుంటారు, తీస్తుంటారు. స్టాక్ పడిపోయినప్పుడు భయపడి తీస్తారు. లాభపడుతుంటే ఇంకా లాభాలు వస్తాయని ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ వాటిని అలాగే అట్టిపెట్టరు. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ, తీస్తూ ఉండటం సరైన పెట్టుబడి విధానం కాదు. దీర్ఘకాలంలో ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి.

అలా సరిపెట్టుకోవద్దు

అలా సరిపెట్టుకోవద్దు

- కొన్ని రంగాలు లేదా స్టాక్స్‌లో ఏడాదికి 15 శాతం నుండి 50 శాతం రాబడి వస్తుంటే సరైన పెట్టుబడి విధానం లేక ఐదు నుండి పది శాతం లాభంతో సరిపెట్టుకుంటారు.

- పెట్టుబడిని ఆలస్యం కూడా చేయవద్దు. ఎంత ఆలస్యం చేస్తే అంత డబ్బును మీరు కోల్పోతున్నట్లే. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెంటనే చేయాలి. అయితే ఇది దీర్ఘకాలానికి, స్థిరమైన స్టాక్స్‌కు వర్తిస్తుంది. ఆలస్యం చేస్తే రాబడి తగ్గవచ్చు.

- నిపుణుల సహాయాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి విషయానికి వస్తే అందులోని నిపుణుల సలహాలు అవసరం.

English summary

రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించవచ్చు, పెట్టుబడి సూత్రాలు... | How to grow your wealth to crores of rupees by investing Rs 10 lakh

People work hard to earn, steal time from their family and friends. But the sad truth is, they spend most of their hard-earned income on buying liabilities that depreciate over time instead of assets that appreciate stocks.
Story first published: Friday, April 1, 2022, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X