రిటైర్మెంట్ అంటే వృత్తి ముగింపు మాత్రమే, కానీ మన ఖర్చుల ప్రయాణం మాత్రం ఎప్పటికీ ఆగదు. మెడికల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు లేదా బంధువులకు సహాయం చేయడం లాంటివి ఏ సమయంలోనైనా అవసరం అవుతాయి. అటువంటి సందర్భాల్లో లోన్లు ఒక పరిష్కారం అవుతాయి. కాని రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఆదాయం తగ్గిపోవడంతో లోన్ తీసుకోవడం కష్టంగా అనిపించినా, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా కొన్ని ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

1. రివర్స్ మార్ట్గేజ్:
రివర్స్ మార్ట్గేజ్ అనేది 60 ఏళ్లకు పైబడిన రిటైర్డ్ ఇంటి యజమానులకు ఆదాయం అందించే ఒక ప్రత్యేక ఆర్థిక సదుపాయం. ఈ పథకం కింద, ఇంటి యజమానులు తమ ఇంటిని మోర్ట్గేజ్ పెట్టి బ్యాంక్ నుండి ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా ప్రతినెలా కొంత డబ్బు పొందొచ్చు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, వారు బతికున్నంత కాలం ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంటి యజమాని మరణం తర్వాతనే ఆ ఇల్లు అమ్మబడుతుంది ఆ వచ్చిన దాంట్లో బ్యాంక్ తన డబ్బు తీసుకుంటుంది. మరొక ముఖ్యమైన లాభం ఏమిటంటే, ఈ పథకం ద్వారా పొందే డబ్బు పూర్తిగా ట్యాక్స్-ఫ్రీ అవుతుంది. కాబట్టి పెన్షన్‌తో పాటు అదనంగా వచ్చే స్థిరమైన ఆదాయ వనరుగా రివర్స్ మార్ట్గేజ్ రిటైర్డ్ వ్యక్తులకు గొప్ప సహాయం అందిస్తుంది.
2. పెన్షన్ ఆధారంగా వ్యక్తిగత రుణాలు:
పెన్షన్ పొందుతున్న వారికి బ్యాంకులు ప్రత్యేక రుణాలని అందిస్తున్నాయి. ముఖ్యంగా PNB, SBI వంటి ప్రభుత్వ బ్యాంకులు రిటైర్డ్ ఉద్యోగులు, డిఫెన్స్ పెన్షనర్లకు ఈ రుణాన్ని సులభంగా ఇస్తాయి. ఎంత రుణం అనేది మీరు పొందే పెన్షన్ మొత్తంపై ఆధారపడి నిర్ణయించబడుతుంది. సాధారణంగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు రుణ కాల వ్యవధి ఉంటుంది. వడ్డీ రేటు కూడా సాధారణ పర్సనల్ లోన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. తిరిగి చెల్లింపు కోసం మీ పెన్షన్ ఖాతా నుంచే ఈఎంఐలు ఆటోమేటిక్‌గా తగ్గించ బడతాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది రిటైర్డ్ జీవితంలో ఆర్థిక సహాయం అవసరమైనప్పుడు ఒక మంచి అవకాశం అవుతుంది.
3. గోల్డ్ లోన్లు:
గోల్డ్ లోన్లు సీనియర్ సిటిజన్లుకు చాలా సులభంగా అందుబాటులో ఉండే ఆప్షన్. కొన్ని గంటల్లోనే డబ్బు ఖాతాలోకి వస్తుంది కాబట్టి అత్యవసర సమయాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. పెద్దగా డాక్యుమెంట్లు అవసరం ఉండదు, అలాగే ఆదాయం చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇతర పర్సనల్ లోన్లతో పోలిస్తే వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల వైద్య ఖర్చులు లేదా అకస్మాత్తుగా వచ్చే అవసరాల కోసం గోల్డ్ లోన్ ఒక మంచి ఎంపిక అవుతుంది.
4. సెక్యూర్డ్ లోన్స్:
రిటైర్డ్ వ్యక్తులు తమ వద్ద ఉన్న ఎఫ్‌డీలు, మ్యూచువల్ ఫండ్లు, ఎల్‌ఐసీ పాలసీలు వంటి ఆస్తులపై రుణం తీసుకోవచ్చు. ఈ రకమైన రుణాన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు, ఎందుకంటే మీరు ఇచ్చే ఆస్తులు గ్యారంటీగా ఉంటాయి. రుణ పరిమితి మీరు పెట్టుబడి చేసిన ఆస్తుల విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ లోన్లపై వడ్డీ రేటు సాధారణ పర్సనల్ లోన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కనుక అనుకోని వైద్య ఖర్చులు, ఇల్లు మరమ్మత్తులు లేదా తాత్కాలిక ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇవి ఒక మంచి ఎంపిక అవుతాయి.
5. పిల్లలతో కలిసి కో-బారోయింగ్:
సీనియర్ సిటిజన్లకు పెద్ద మొత్తంలో లోన్ అవసరమయ్యే సమయంలో ఆదాయం ఉన్న పిల్లలతో కలిసి కో-బారోయింగ్ (Co-borrowing) రూపంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా కో-అప్లై చేయడం వల్ల లోన్ అర్హత గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇంటి పనులకు, వైద్య ఖర్చులు లేదా హోమ్ లోన్లు వంటి అధిక మొత్తంలో అవసరమయ్యే ఖర్చుల కోసం ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లల ఆదాయం కూడా కలవడం వల్ల మంచి వడ్డీ రేటు మరియు ఎక్కువ కాలవ్యవధి లభించే అవకాశం ఉంటుంది, దాంతో సీనియర్లకు లోన్ భారం కొంతవరకు తేలికగా మారుతుంది.
రిటైర్డ్ అయిన వ్యక్తులు రుణం తీసుకునే ముందు తమ ఆర్థిక పరిస్థితిని బాగా అంచనా వేసుకోవాలి. ముందుగా నెలవారీ ఆదాయం, అందులో పెన్షన్, రెంటల్ ఇన్‌కమ్, FD వడ్డీలు వంటివి చూసుకొని అంచనా వేసుకోవాలి. EMI భారం తమ బడ్జెట్‌లో 30-40% లోపే ఉండేలా చూసుకోవడం అవసరం. అలాగే, సీనియర్లకు రుణ అవసరం ఎక్కువగా వస్తే అది ముఖ్యంగా వైద్య ఖర్చుల కారణంగా అవుతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మరియు క్రిటికల్ ఇల్లెనెస్ కవర్ ఉంటే, రుణంపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, ఆర్థిక భారం కూడా తగ్గుతుంది.
సీనియర్ సిటిజన్స్ రుణాలు తీసుకోవడంలో జాగ్రత్తలు, సరైన ప్రణాళిక మరియు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యమైనవి. తగిన రీసెర్చ్, అవసరాలకు తగిన లోన్ ఎంపిక, మరియు భవిష్యత్తులో తిరిగి చెల్లించడంపై ఆలోచన ఉంచితే రిటైర్మెంట్ జీవితంలో ఆర్థిక సౌకర్యాన్ని, మానసిక శాంతిని అందించవచ్చు. కాబట్టి రుణాలను జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించుకోవటం అత్యంత అవసరం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications