ఇంట్లో బంగారం ఉందా? దాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించే అద్భుతమైన ఐడియాలు ఇవే!
మీ ఇంట్లో బంగారం ఉందా? అయితే మీరు దాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించొచ్చని మీకు తెలుసా? సాధారణంగా భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్. ఇంట్లో పెళ్లిళ్లకైనా, పండగలకైనా ఆభరణాలు కొనడం మనకు అలవాటు. అయితే ఈ బంగారం కేవలం లాకర్‌కే పరిమితం కాకుండా.. మీకు అవసరమైనప్పుడు ఆర్థిక అండగా ఎలా నిలుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మకుండానే దానిపై కొంత ఆదాయం సంపాదించొచ్చు. అలాంటి కొన్ని మార్గాలు ఇప్పుడు చూద్దాం.

1.గోల్డ్ మోనటైజేషన్ స్కీమ్ (Gold Monetization Scheme - GMS)
చాలామందికి తెలియని అద్భుతమైన ప్రభుత్వ పథకం ఇది. మీ దగ్గర వృధాగా ఉన్న ఆభరణాలు, నాణేలను ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు.
• వడ్డీ ఆదాయం: మీరు డిజిటల్ గోల్డ్ లేదా క్యాష్ రూపంలో 2.25% నుండి 2.50% వరకు వడ్డీని పొందవచ్చు.
• పన్ను మినహాయింపు: ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదా ఆదాయపు పన్ను ఉండదు.
• లాభం: బంగారం ధర పెరిగితే ఆ లాభం మీకు వస్తుంది, అదనంగా బ్యాంక్ ఇచ్చే వడ్డీ కూడా మీ అకౌంట్లో పడుతుంది.
2. గోల్డ్ లీజింగ్ (Gold Leasing)
ఇది ఇటీవల కాలంలో ఫిన్‌టెక్ యాప్స్ ద్వారా ప్రాచుర్యం పొందుతోంది. మీ దగ్గర ఉన్న గోల్డ్‌ను పెద్ద పెద్ద జ్యువెలర్లకు (నగల వ్యాపారులకు) లీజుకు ఇవ్వవచ్చు. వారు ఆ బంగారాన్ని తమ వ్యాపారానికి వాడుకుని.. మీకు అదనంగా 4% నుండి 5% వరకు 'బంగారం రూపంలోనే' వడ్డీని ఇస్తారు. దీనివల్ల మీ దగ్గర ఉన్న బంగారం పరిమాణం ప్రతి ఏటా పెరుగుతూ పోతుంది.
3. లోన్ ఎగైనెస్ట్ గోల్డ్ ఫర్ బిజినెస్ (Overdraft Facility)
కేవలం నగదు తీసుకోవడమే కాకుండా, మీ గోల్డ్‌ను సెక్యూరిటీగా పెట్టి Overdraft (OD) సౌకర్యం పొందవచ్చు. మీరు వాడిన డబ్బుకు మాత్రమే వడ్డీ కడితే సరిపోతుంది. ఇది చిన్న వ్యాపారులకు అత్యవసర పెట్టుబడి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
4. గోల్డ్ లోన్
ఇక చివరగా గోల్డ్ లోన్. ఇదొక సెక్యూర్డ్ లోన్ (Secured Loan). అంటే మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ సంస్థలో తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చు. దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. బంగారు ఆభరణాలపై మీ యాజమాన్య హక్కులు మీ దగ్గరే ఉంటాయి. మీరు తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి తిరిగి చెల్లించిన వెంటనే, మీ నగలను సురక్షితంగా వెనక్కి తీసుకోవచ్చు.
పర్సనల్ లోన్లతో పోలిస్తే Gold loan పై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బ్యాంకుకు మీ బంగారం సెక్యూరిటీగా ఉంటుంది. దీనివల్ల పిల్లల చదువులకైనా, ఇంటి మరమ్మత్తులకైనా లేదా ఇతర అత్యవసర ఖర్చులకైనా మీ దీర్ఘకాలిక పొదుపును ముట్టుకోకుండానే నిధులు సమకూర్చుకోవచ్చు. నేడు మధ్యతరగతి కుటుంబాలలో ఈ లోన్లకు డిమాండ్ విపరీతంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం.
బంగారం.. ఆదాయ మార్గం..
బంగారాన్ని కేవలం బీరువాలో పెట్టి లాక్ చేస్తే అది మీకు ఎటువంటి అదనపు లాభాన్ని ఇవ్వదు. కానీ పైన చెప్పిన గోల్డ్ లోన్ (Gold loan) లేదా గోల్డ్ మానిటైజేషన్ (Gold Monetization) వంటి మార్గాలను ఎంచుకుంటే, మీ ఆస్తి పెరుగుతూనే మీకు అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనివల్ల మీరు తాకట్టు పెట్టే బంగారంపై వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టిగ మీ ఇంట్లో ఉన్న బంగారం కేవలం బీరువాకే పరిమితం చేయకండి. దానిని మీ ఆర్థిక ఎదుగుదలకు ఒక పెట్టుబడిగా మార్చుకోండి.


Click it and Unblock the Notifications