కోటి రూపాయలు సంపాదించాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇప్పుడున్న రోజుల్లో అది పెద్ద కష్టమేమీ కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ కాలంలోనే కోటి రూపాయల కలను నిజం చేసుకోవచ్చు. దీన్ని సాకారం చేసేందుకు కొన్ని స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓపిక, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే చాలు ఈజీగా రూ. కోటి సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
బెస్ట్ స్కీమ్ ఇదే..
కోటి రూపాయలు పోగు చేయడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్. ఈ స్కీమ్ ద్వారా మీరు 20 నుంచి 30 ఏళ్లలో కోటి రూపాయలు సంపాదించొచ్చు. మీరు ముప్ఫై ఏళ్ల నుంచి డబ్బు మదుపు చేయడం మొదలుపెడితే యాభై ఏళ్ల వయసు వచ్చే సరికి రూ. కోటి ఫండ్ మీ దగ్గర ఉంటుంది. పెన్షన్ అనేది భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు భరోసానిస్తుంది. అందుకే చాలామంది ఇప్పుడు ఎన్‌పీఎస్ పథకం గురించి తెలుసుకుంటున్నారు. ఇది ప్రభుత్వ మద్దతుతో నడిచే సేవింగ్స్ ప్లాన్. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు.

కాలిక్యులేషన్ ఇలా..
నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది మ్యూచువల్ ఫండ్ మాదిరిగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఇందులో కూడా ఈక్విటీ, బాండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఈ స్కీమ్ లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ లో ఎంతెంత పెట్టుబడి పెడుతున్నారు అన్న దాన్ని బట్టి ఆదాయం మారుతుంటుంది. ఓవరాల్ గా ఈ స్కీమ్ లో 8 నుంచి 9 శాతం యాన్యువల్ రిటర్న్స్ ను ఆశించొచ్చు. ఈ లెక్కన యంగ్ ఏజ్ లోనే ఈ స్కీమ్ లో పెట్టుబడి మొదలుపెడితే రిటైర్మెంట్ నాటికి రూ. కోటి సంపాదించొచ్చు. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.10 వేలు పెట్టుబడి పెడుతూపోతే 9 శాతం రిటర్న్స్ కింద రిటైర్మెంట్ నాటికి రూ.1.04 కోట్లు సంపాదించొచ్చు. ఇంకా ఇందులో వయసు వారీగా ప్రణాళికలు చేయొచ్చు. అదెలాగంటే..
ఫార్ములా ఇదే..
ఒక వ్యక్తి నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే రూ. 10 వేలను ఇలా డివైడ్ చేసుకుంటే మంచిది.
- 25-35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్లు 75% ఈక్విటీ, 15% కార్పొరేట్ బాండ్లు, 5% ప్రభుత్వ బాండ్లు, 5% ఇతర ప్రత్యామ్నాయాల్లో పెట్టుబడి పెట్టాలి.
- 36-45 సంవత్సరాల వాళ్లు 60% ఈక్విటీ, 25% కార్పొరేట్ బాండ్లు, 10% ప్రభుత్వ బాండ్లు, 5% ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.
- 46-55 సంవత్సరాల వయసున్న వాళ్లు 40% ఈక్విటీ, 35% కార్పొరేట్ బాండ్లు, 20% ప్రభుత్వ బాండ్లు, 5% ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు.
- 56-60 సంవత్సరాలు వయసున్న వాళ్లు 25% ఈక్విటీ, 40% కార్పొరేట్ బాండ్లు, 30% ప్రభుత్వ బాండ్లు, 5% ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.
ఈ పై ఫార్ములా ద్వారా పెట్టుబడి పెడుతూ పోతే సగటున 9 నుంచి 10 శాతం రిటర్న్స్ గనుక వస్తే.. రిటైర్మెంట్ నాటికి రూ. కోటి ఫండ్ సమకూరుతుంది.
More From GoodReturns

Gold bonds: బంగారంతో జాక్పాట్.. రూ. 1 లక్ష పెడితే రూ. 4 లక్షలు అయ్యాయి! రేపే ఆ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!



Click it and Unblock the Notifications