సాధారణంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు 'షార్ట్‌కట్స్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. కానీ, నిజంగా సంపదని సృష్టించే రహస్యం క్రమశిక్షణతో కూడి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మధ్య తరగతి వాళ్లు కూడా కోట్లలో సంపాదించొచ్చు అని సూచిస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

చార్టర్డ్ అకౌంటెంట్, ఆర్థిక నిపుణుడు నితిన్ కౌశిక్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మధ్యతరగతి జీతం సంపాదించే వారు కూడా 20 ఏళ్లలో రూ. 3 కోట్ల నుంచి రూ. 6 కోట్ల సంపదను నిర్మించుకోవచ్చని చెప్పారు. దీనికోసం ఒక 'సింపుల్ రూల్' వివరించారు. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి (how to earn 1 crore) అనేది ఒక లక్ష్యం మాత్రమే కాదని.. సరైన అలవాట్లు ఉంటే అంతకంటే ఎక్కువే సంపాదించవచ్చని ఆయన అంటున్నారు.
సంపద ఎందుకు దూరమవుతోంది?
మనం ధనవంతులు కాలేకపోవడానికి డబ్బు సంపాదించడం కష్టమని అనుకుంటాం. కానీ, అసలు సమస్య సంపాదనలో కాదు, క్రమశిక్షణ పాటించడంలో ఉంది. మన పెట్టుబడుల వేగం కంటే, మన ఖర్చుల వేగమే (Lifestyle Inflation) వేగంగా పెరుగుతోంది. జీతం పెరిగినప్పుడల్లా ఖర్చు పెంచడం, అనవసరమైన క్రెడిట్ తీసుకోవడం వంటి చిన్న చిన్న తప్పులే మనల్ని ఆర్థిక స్థిరత్వానికి దూరం చేస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను నిందించే బదులు, మన ఖర్చు అలవాట్లపై దృష్టి పెట్టడమే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.
కోట్ల సంపదకు 3 కీలక సూత్రాలు
ఏదో అదృష్టం, అసాధారణమైన ఆదాయం ఉంటేనే సంపద పెరుగుతుందనే భావన తప్పు. మీరు కోటి రూపాయలు సంపాదించాలి అని ఆలోచిస్తున్నా లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, కౌశిక్ చెప్పిన ఈ మూడు ప్రాథమిక సూత్రాలు పాటించాలి..
1. 15% కచ్చితంగా పెట్టుబడి పెట్టండి (SIP రూల్)
మీ నెలవారీ ఆదాయంలో కనీసం 15% కచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. అది కూడా తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్లలో (Low-cost Index Funds) సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPs) ద్వారా పెట్టుబడి పెట్టండి. ఇండెక్స్ ఫండ్లలో దీర్ఘకాలికంగా 12% నుంచి 15% వరకు రాబడి లభించే అవకాశం ఉంది. ఈ స్థిరత్వం, క్రమశిక్షణ ఉంటే చాలు, వడ్డీపై వడ్డీ (Compounding) శక్తి మీ సంపదను రెట్టింపు చేస్తుంది. దీన్ని ఆర్థిక నిపుణులు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ఓపికతో ఈ పద్ధతిని ఓ 20 ఏళ్లు కొనసాగిస్తే రూ. కోటి నుంచి రూ. 3 కోట్ల వరకూ సంపాదించడం మధ్యతరగతి వారికి కూడా సాధ్యమే.
2. 85% లోనే జీవితాన్ని నిర్మించుకోండి
మీరు సంపాదించిన దానిలో మిగిలిన 85% ఆదాయంతోనే మీ జీవనశైలిని ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా జీతం పెరిగిన ప్రతిసారీ ఖర్చులను పెంచే 'లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్' (Lifestyle Inflation) అనే అలవాటుకు దూరంగా ఉండాలి.
3. అధిక వడ్డీ ట్రాప్‌లకు దూరంగా ఉండండి
అనవసరమైన EMIలు, క్రెడిట్ కార్డుల అధిక వాడకం మరియు 'ఇప్పుడే కొనుగోలు చేయండి, తర్వాత చింతించండి' (Buy now, regret later) అనే అప్పులకు దూరంగా ఉండాలి. అధిక వడ్డీ రేట్లు మీ ఆదాయంలో సింహభాగాన్ని తినేస్తాయి. ఆర్థిక క్రమశిక్షణకు ఇది మొదటి అడుగు.
నెంబర్స్ కాదు, ప్రవర్తనే కీలకం!
సంపద విషయంలో కేవలం మీ ఆర్థిక ప్రవర్తన మాత్రమే అద్భుతం చేయగలదు. మార్కెట్ హెచ్చుతగ్గులు సహజం. వాటిని చూసి భయపడకుండా.. ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం, అనవసరమైన అప్పులకు దూరంగా ఉండటం అనే ఈ సాధారణ నియమాలను పాటిస్తే.. మధ్యతరగతి వారు కూడా కోటీశ్వరులు కావడం ఖాయం అని నిపుణులు గట్టిగా చెప్తున్నారు. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి (how to earn 1 crore) అనే ప్రశ్నకు సమాధానం స్టాక్ టిప్స్‌లో లేదు, మీ స్థిరమైన అలవాట్లలో ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications