Bank account: బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటున్నారా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ మీకోసం!

చాలామందికి రకరకాల కారణాల వల్ల ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. పాత ఉద్యోగం మారినప్పుడో లేదా వేరే ఊరికి షిఫ్ట్ అయినప్పుడో పాత బ్యాంక్ అకౌంట్ (bank account) అలాగే ఉండిపోతుంది. అయితే, వాడకుండా వదిలేసిన అకౌంట్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీలు పడటం, ఏటా డెబిట్ కార్డ్ ఛార్జీలు కట్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. అందుకే, అవసరం లేని అకౌంట్‌ను క్లోజ్ చేయడం ఉత్తమం. మరి ఆ ప్రాసెస్ ఏంటో సింపుల్‌గా చూద్దాం.

How to close a bank account bank account closure process application for bank account closing bank account closure charges inactive savings account SBI account closure HDFC bank account closing Savings account closure form banking tips

ఫస్ట్ స్టెప్: బ్యాలెన్స్‌ను 'జీరో' చేయండి

అకౌంట్ క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నాక, ముందుగా అందులో ఉన్న బ్యాలెన్స్‌ను వేరే అకౌంట్‌లోకి మార్చుకోండి. అయితే, అకౌంట్‌లో కనీసం వంద రూపాయల లోపు ఉంచడం మంచిది, ఎందుకంటే క్లోజ్ చేసే సమయంలో ఏవైనా చిన్న చిన్న పెండింగ్ ఛార్జీలు ఉంటే బ్యాంక్ వారు అక్కడే సర్దుబాటు చేస్తారు. అలాగే, మీ అకౌంట్ స్టేట్‌మెంట్ కావాలనుకుంటే క్లోజ్ చేయకముందే డౌన్‌లోడ్ చేసుకోండి. అకౌంట్ క్లోజ్ అయ్యాక స్టేట్‌మెంట్ రావడం కష్టం.

ఆటోమేటిక్ పేమెంట్స్ క్యాన్సిల్ చేయండి

మనం చేసే అతి పెద్ద తప్పు ఇక్కడే ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ (bank account) నుంచి ఏవైనా మంత్లీ సబ్‌స్క్రిప్షన్లు (Netflix, Amazon Prime) లేదా లోన్ ఈఎంఐలు (EMIs), ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్ అవుతుంటే వాటిని వెంటనే వేరే అకౌంట్‌కు లింక్ చేయండి. లేదంటే అకౌంట్ క్లోజ్ చేసే సమయంలో టెక్నికల్ సమస్యలు రావచ్చు.

బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం తప్పనిసరి

ప్రస్తుతం చాలా బ్యాంకులు అకౌంట్ ఓపెనింగ్ ఆన్‌లైన్‌లో ఇస్తున్నాయి కానీ, క్లోజ్ చేయడానికి మాత్రం నేరుగా బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి 'అకౌంట్ క్లోజర్ ఫామ్' అడగండి. అందులో మీ అకౌంట్ నంబర్, ఎందుకు క్లోజ్ చేస్తున్నారో కారణం రాయాలి. మీ దగ్గర ఉన్న చెక్ బుక్, డెబిట్ కార్డ్ (ATM Card), , పాస్‌బుక్ వంటివి బ్యాంకుకు తిరిగి ఇచ్చేయాలి.

ఛార్జీలు ఉంటాయా?

సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల్లోపు క్లోజ్ చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అలాగే అకౌంట్ ఓపెన్ చేసి ఏడాది దాటితే కూడా చాలా బ్యాంకులు ఫీజు వసూలు చేయవు. కానీ, 14 రోజుల నుంచి ఒక ఏడాది లోపు అకౌంట్ క్లోజ్ చేస్తే మాత్రం 'క్లోజర్ ఛార్జీలు' (Closure Charges) కట్టాల్సి ఉంటుంది. ఇది బ్యాంకుని బట్టి రూ. 200 నుండి రూ. 500 వరకు ఉండవచ్చు.

మీరు అప్లికేషన్ ఇచ్చాక బ్యాంక్ వారు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ కాపీ ఇస్తారు. దాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సాధారణంగా 3 నుండి 10 పని దినాల్లో మీ అకౌంట్ శాశ్వతంగా క్లోజ్ అవుతుంది. అకౌంట్ క్లోజ్ అయినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. ఇలా పద్ధతి ప్రకారం చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+