ఈ సూపర్ ఐడియాతో మీరు ధనవంతులు అవ్వొచ్చు... రోజుకి రూ.100 సేవ్ చేస్తే చాలు..
ఉద్యోగార్థి అయినా, వ్యాపారవేత్త అయినా.. ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలలు కంటుంటారు. చాలా సార్లు ప్రజలు ఎంత కష్టపడి సంపాదించినా కూడా సేవింగ్స్ చేయలేరు. దీంతో ఒకోసారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అయితే ఆలోచనతో డబ్బు సరిగ్గా పెట్టుబడి పెట్టి ఉంటే ధనవంతులుగా మారకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. అయితే ధనవంతులు అవ్వడం అంత కష్టం ఎం కాదు. అవును నిజమే.. ప్రతిరోజూ కేవలం రూ. 100 సేవ్ చేయడం ద్వారా మీరు ఈజీగా కోటీశ్వరులుగా మారగల ఒక మార్గం ఉంది.
మీరు ధనవంతులు కావడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా మీ జీతం తక్కువగా ఉన్నాసరే మీరు ప్రతిరోజు రూ. 100 ఈజీగా ఆదా చేసుకోవచ్చు. ప్రతినెలా ఆదాయం కాస్త పెరిగితే పెట్టుబడి పెడతారా అని ఎదురుచూసే వారు చాలా మంది ఉన్నారు. కానీ చాలా సార్లు అలాంటి వ్యక్తులు ఎప్పటికి అలాగే వేచి చూస్తుంటారు.

మీరు ప్రతిరోజూ రూ.100 సేవ్ చేయడం ద్వారా రూ.1 కోటి ఫండ్‌ను పోగేయొచ్చు. దీనికి బెస్ట్ అప్షన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP). SIP ద్వారా మీరు కేవలం రూ. 100 ఆదా చేయడం ద్వారా రూ. 1 కోటి కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు. దీని ఫార్ములా కూడా చాలా సులభం. మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులకు గొప్ప రాబడిని ఇచ్చాయి. 20 శాతం వరకు రాబడిని ఇచ్చిన కొన్ని ఫండ్‌లు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి దాదాపు అందరికీ తెలుసు. మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే SIP ద్వారా రూ. 100 ప్రతిరోజు పెట్టుబడిగా స్టార్ట్ చేయాలి.
రూ. 100 ఆదా చేయడం ద్వారా కోటి
ప్రతిరోజూ రూ.100 జమ చేస్తే నెల రోజుల్లో రూ.3 వేలు అవుతుంది. మీరు దానిని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే అలాగే మీరు సంవత్సరానికి 20 శాతం రాబడిని పొందితే 21 సంవత్సరాలలో అంటే 252 నెలల్లో మీ ఫండ్ సుమారు రూ. 1,16,05,388 అవుతుంది. అయితే ఈ కాలంలో మీరు కేవలం రూ.7,56,000 మాత్రమే డిపాజిట్ చేస్తారు. మీరు 20 శాతానికి బదులుగా 15 శాతం రాబడిని పొందితే అయిన కూడా రూ. 53 లక్షలు లభిస్తాయి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు అవ్వాలనుకుంటే మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని ఇంకొంచెం పెంచుకోవాలి.


Click it and Unblock the Notifications