హోమ్ లోన్ ఎలా తీసుకోవాలి: అర్హత, డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకోండి
ఇంటిని కొనుగోలు చేయడానికి గణనీయమైన నిధులు అవసరం. చేతిలో అవసరమైన మొత్తం లేకుంటే కనుక ఇతర వ్యక్తిగత రుణాలతో పోలిస్తే హోమ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. హోమ్ లోన్ మొత్తం, వడ్డీ రేటును కలిపి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈఎంఐగా మారుస్తాయి. ఉద్యోగి నుండి వ్యాపారస్తుడి వరకు చాలామందికి ఇల్లు కట్టుకోవడం ఓ కల.
దీనిని నిజం చేసుకోవడానికి చేతిలో డబ్బులు లేని పరిస్థితిల్లో హోమ్ లోన్ మంచి ఎంపిక. హోమ్ లోన్ కోసం ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీత ఏం చేస్తున్నారు, క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు. హోమ్ లోన్ కావాలంటే అర్హత, డాక్యుమెంటేషన్, లోన్ అగ్రిమెంట్, డిస్పర్స్‌మెంట్ ఉంటాయి.

రుణ అర్హత
ఆన్ లైన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి ఆయా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో మీకు వచ్చే రుణ మొత్తం ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు.

డాక్యుమెంటేషన్
ఐడెంటిటీ, అడ్రస్, ఆదాయం కోసం సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేయాలి. ఆదాయ పత్రాలతో వేతన స్లిప్, ఐటీ ఫామ్, బ్యాంకు స్టేట్‌మెంట్ ఉంటాయి. హోమ్ లోన్ కంటే ముందు ఏదైనా రుణం తీసుకుంటే దానిని కూడా అటాచ్ చేయాలి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి. భౌతిక తనిఖీ, రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణం మంజూరు లేఖ వస్తుంది.

లోన్ అగ్రిమెంట్
సూత్రప్రాయ ఆమోదం అనంతరం రుణగ్రహీత అంగీకరిస్తే, రుణగ్రహీత, రుణదాతల మధ్య ఒప్పందం ఉంటుంది. రుణ ఒప్పందం సమయంలో ఒరిజినల్ ఆస్తి పత్రాలను సమర్పించడం తప్పనిసరి. రుణ ఒప్పందం కోసం రుణ మొత్తంలో 0.1 శాతం నుండి 0.2 శాతం వరకు స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు.

వితరణ
హోమ్ లోన్‌కు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఆస్తి విషయంలో చెల్లింపులు పని పురోగ్రతికి అనుసంధానించబడి ఉంటాయి. అలాగే, రెడీ టు హోమ్ అయితే నిర్ణీత ధృవీకరణ తర్వాత మొత్తాన్ని ఒకేసారి పంపిణీ చేయవచ్చు.. విక్రేతకు చెల్లించవచ్చు.


Click it and Unblock the Notifications