ఇళ్లు కొంటున్నారా? కరోనా హోమ్ బయ్యర్స్ టేస్ట్‌ను కూడా మార్చేసింది

కరోనా జీవన విధానాన్ని మార్చివేసింది. ఈ కోవిడ్ యుగంలో పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సాధారణంగా మారిపోయాయి. మహమ్మారి కారణంగా లైఫ్ స్టైల్ నిలిచిపోయింది. ఆర్థికంగా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే వ్యాక్సినేషన్ వంటి అంశాలు ఆర్థిక రికవరీకి తోడ్పడుతున్నాయి. కరోనా సమయంలో ఆర్థిక రికవరీకి మద్దతిచ్చేందుకు బ్యాంకులు పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికిల్ లోన్, గోల్డ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాయి. జీవన విధానం మార్చడంలో భాగంగా కరోనా ఇంటి కొనుగోలు ట్రెండ్‌ని కూడా మార్చేసింది. కరోనా సమయంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో మారిన అంశాలు, అలాగే చాలా కాలంగా కొనసాగుతున్న అంశాలు చూద్దాం.

తదుపరిస్థాయికి రియాల్టీ

తదుపరిస్థాయికి రియాల్టీ

కరోనా సమయంలో లాక్ డౌన్, కోవిడ్ ఆంక్షలు రియల్ వ్యాపారాన్ని కూడా డిజిటల్ దిశగా పయనించేలా చేసింది. ఐటీ రంగం నుండి దాదాపు అన్ని రంగాలు డిజిటలైజేషన్ వైపు మరలాయి. చాలా కాలంగా గృహ కొనుగోలుదారులు, విక్రేతలు, అద్దెదారులు, లాండ్ లార్డ్స్, మధ్యవర్తులు రియాల్టీ పోర్టల్స్, ఇతర సాధనాలను ఉపయోగిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి దీనిని తదుపరి స్థాయికి తీసుకు వెళ్లింది.

VR టెక్నాలజీతో వర్చువల్ టూర్

VR టెక్నాలజీతో వర్చువల్ టూర్

తాము కేవలం 90 రోజుల్లోనే వినియోగదారు, వ్యాపార డిజిటల్ అడాప్షన్‌లో పదేళ్ల ముందుకు వెళ్లామని, రియల్ ఎస్టేట్ డిజిటల్ ఫస్ట్ సెక్టార్‌గా మారిందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి అన్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, నిపుణులు ఇప్పుడు విస్తృతంగా ఉపయోగిస్తున్న కొన్ని కొత్త టెక్నాలజీలలో వర్చువల్ రియాల్టీ (VR), ఆగ్మెంటెడ్ రియాల్టీ (AR), 3D ప్రోగ్రామ్స్, కృత్రిమ మేధ (AI) ఉన్నాయి. పొటెన్షియల్ హోమ్ బయ్యర్స్ 3డీ యాప్స్ ద్వారా డిజిటల్‌గా ప్రాపర్టీస్‌ను వర్చువల్ టూర్ చేయడానికి వీలుగా డెవలపర్స్ VR టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ఈ రూమ్స్ తప్పనిసరి...

ఈ రూమ్స్ తప్పనిసరి...

ముఖ్యంగా ఆన్ లైన్ స్కూల్, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రజలకు ఇంటి వద్ద ఎక్కువ స్థలం అవసరమైంది. దీంతో అందుకు అనుగుణంగా కొత్త ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. స్క్వేర్ యార్డ్స్ సెర్చ్ ఆన్ లైన్ ట్రెండ్ ప్రకారం 1BHKతో పోలిస్తే 1.5BHK వంటి ఆధునిక సౌకర్యవంతమైన రూమ్స్ కాన్ఫిగరేషన్ కోసం డిమాండ్ 54 శాతం పెరిగింది. అయితే 2.5, 3.5BHK హోమ్స్ సెర్చింగ్ మొదటి ఆరు నగరాల్లో వరుసగా 150 శాతం, 132 శాతం పెరిగాయి. 3BHK, ప్లస్‌తో వచ్చే గృహాలు కూడా జనవరి 2021 నుండి డిమాండ్‌లో 150 శాతం పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ-లర్నింగ్ మోడల్స్ ఇప్పుడు తప్పనిసరిగా మారాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+