భార్యాభర్తలు డబ్బును ఎలా సేవ్ చేయాలంటే ? ఈ విషయాలను పాటిస్తే చాలు..
ప్రస్తుత జనరేషన్లో ఇంట్లో ఒక్కరు కాదు ఇద్దరు ఉద్యోగం చేస్తే లైఫ్లో త్వరగా సెటిల్ అవొచ్చు అని అనుకుంటుంటారు. మంచి ఉద్యోగం, జీతం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదురుకోవాల్సి వస్తుంటుంది. అయితే భార్యాభర్తల మధ్య డబ్బు ఖర్చుల విషయాల్లో సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఖర్చులు, సేవింగ్స్, పెట్టుబడి సంబంధించి నిర్ణయాలన్నీ ఇద్దరు కలిసి తీసుకుంటే ఈ సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నట్లయితే ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు మీ ఫ్యామిలీ ఫైనాన్సియల్ స్టేటస్ సెట్ చేసుకోవచ్చు.
భార్యాభర్తలిద్దరూ వారి జీతం లేదా ఆదాయం గురించి ఓపెన్ గా ఉండాలి. ఫ్యామిలీ మొత్తం ఆదాయం గురించి ఇద్దరికీ ఖచ్చితమైన ఆలోచన ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల కలిసి ఖర్చులు, సేవింగ్స్ అలాగే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇంకా పిల్లల చదువులు, పెళ్లి, సొంత ఇంటి కల వంటి ఫ్యామిలీ లక్ష్యాలను సెట్ చేసుకోవడం ముఖ్యం. ఈ లక్ష్యాలను సాధించడానికి, ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకోవాలి అలాగే లాంగ్ టైం పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.

కుటుంబ ఖర్చులు, సేవింగ్స్ అలాగే పెట్టుబడుల కోసం ఇద్దరు కలిసి బడ్జెట్ ఎంత అని సెట్ చేయడం ముఖ్యం. దీన్ని బట్టి జీతం/ఆదాయంలో ఎంత ఖర్చులకు, ఎంత సేవింగ్స్ కు, ఎంత పెట్టుబడికి పెడుతున్నారో తెలుస్తుంది. డబ్బుకు సంబంధించి ఏదైనా విషయం భార్యాభర్తలిద్దరూ మధ్య ఉండాలి. ఉదాహరణకు, ఒకరు కరెంట్ లేదా వాటర్, పాలు లేదా హౌస్ మెయింటైనన్స్ బిల్లులు చూసుకోవచ్చు. మరొకరు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ విధంగా ఇంటి పనులను షేర్ చేసుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా మీ ఫ్యామిలీ 3-6 నెలల పాటు ఖర్చులను కవర్ చేయగల అత్యవసరమైన డబ్బు అందుబాటులో ఉండేలా ఉంచుకోవాలి. ఈ ఫండ్ ఊహించని లేదా అనుకోకుండా ఆర్థిక సమస్యలు వస్తే ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.
ఫ్యామిలీకి కారు లేదా సొంత ఇల్లు వంటివి కొనాల్సివస్తే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దీనితో మీకు లోన్ ఎంత వరకు అవసరం అనేది ముందుగానే అంచనా వేయవచ్చు, సరైన నిర్ణయం తీసుకోవచ్చు. భార్యాభర్తలు కలిసి లాంగ్ టర్మ్ ఫైనాన్సియల్ టార్గెట్స్ ఏంటి అండ్ వాటిని సాధించడానికి ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం వల్ల మంచి రాబడులు వస్తాయి.
ప్రతి ఒక్కరికీ పర్సనల్స్ ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు ఒకరి ప్రాధాన్యతలను మరొకరు దృష్టిలో ఉంచుకోవాలి అలాగే వాటిని నెరవేర్చడం వంటి అవసరాలను ఇంటి బడ్జెట్‌లో చేర్చాలి. ఇంకా కొన్నిసార్లు ఆర్థిక విషయాలపై కోపాలు ఉండవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకోవాలి. దీని వల్ల అపార్ధాలను తొలగిస్తుంది. కుటుంబ సంతోషం ఇంకా సక్సెస్ కలిసి పంచుకోండి. భర్త ప్రమోషన్ లేదా పిల్లలకి మంచి ర్యాంకు వంటి చిన్న చిన్న ఆనందాలను జరుపుకోవడం కుటుంబంలో ప్రేమ, సహకారాన్ని పెంచుతుంది.


Click it and Unblock the Notifications