ఎంత సంపాదించినా ఈ పనులు చేయకుంటే కష్టాలు ఖాయం.. తరువాత ఆలోచించిన వెస్ట్..
డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఖర్చులు కూడా మైంటైన్ చేయడం అంతే కష్టం. ఎంతో కొంత డబ్బు సంపాదించినా సరిగా మైంటైన్ చేయలేని వారు చాలా మంది ఉన్నారు. ప్రతినెల ఖర్చుల లిస్ట్ రెడీ ఉన్నప్పటికీ జీతం వచ్చాక నెలాఖరు నాటికి అకౌంట్ మళ్లీ ఖాళీ అవుతుంది. దింతో భవిష్యత్తులో ఏదైనా ముందు జాగ్రతకి సేవింగ్స్ ఉండవు లేదా వారి కుటుంబా అవసరాలకు ఎటువంటి డబ్బు ఉండదు.
అర్జంటుగా ఏదైనా కష్టం వచ్చిప్పుడు లేదా డబ్బు అవసరమైనప్పుడు ఆందోళన చెందుతుంటారు, సేవింగ్స్ చేసి ఉంటె బాగుండు అని పశ్చాత్తాపపడతారు. ఇలాంటి పరిస్థితి నివారించడానికి జీవితంలో ఈ 4 పనులు చేయండి. మీరు ఇలా చేస్తే భవిష్యత్తులో మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది ఇంకా ఆవసరమైనప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదురుకోవచ్చ్చు. ప్రతి వ్యక్తి తన సంపాదనతో తప్పనిసరిగా చేయవలసిన కొన్ని విషయాలను తెలుసుకోండి...

అన్నింటిలో మొదటిది, మీరు మీ జీతం నుండి ఎమర్జెన్సీ ఫండ్ అనేది రెడీ చేసుకోవాలి. ఉద్యోగం పోయిన, వ్యాపారం ఆగిపోయిన లేదా కుటుంబంలో ఏదైనా పెద్ద సమస్య వంటి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫండ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఈ ఫండ్ ఉంటే మీ కష్ట సమయాల్లో దాని ద్వారా బయటపడొచ్చు అలాగే మీరు పాలసీలు లేదా మరేదైనా బ్రేక్ చేయవలసిన అవసరం ఉండదు. ఏ వ్యక్తి అయినా కనీసం తన ఆరు నెలల ఆదాయానికి సమానమైన మొత్తాన్ని అత్యవసర నిధిగా పెట్టుకోవాలని అని చాలా మంది నిపుణులు చెబుతుంటారు.
జీతంలో 20 శాతం పెట్టుబడి పెట్టండి
రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ ప్రతినెల జీతంలో 20 శాతం ఆదా చేసి పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ప్రతి వ్యక్తి తన జీతంలో కనీసం 20 శాతం పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిబంధన కూడా చెబుతోంది. మీరు రూ. 20,000 సంపాదించినా అన్ని విధాలుగా కనీసం రూ. 4,000 ఆదా చేసి పెట్టుబడి పెట్టండి, ఆదాయం పెరిగేకొద్దీ 20 శాతం వాటా కూడా పెరుగుతూనే ఉంటుంది. మీరు ఈ మొత్తాన్ని SIP, గోల్డ్, RD, FD, PPF, LIC వంటి వివిధ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఆరోగ్య బీమా తీసుకోండి
మూడవ ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్య బీమా. నేటికీ చాలా మంది దీనిని చాలా ముఖ్యమైనదిగా చూడరు, కానీ ఇది మీకు ఇంకా మీ కుటుంబానికి చాలా ముఖ్యమైనది. హెల్త్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అంతే కాకుండా మీ తల్లిదండ్రులు వృద్ధులైతే, ఆ వయస్సులో వారికి వైద్య సంరక్షణ కూడా అవసరం. మీరు ఈ పరిస్థితులకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోకపోతే, మీరు భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా సార్లు ప్రజల డబ్బు వైద్యం కోసం ఎక్కువగా వృధా అవుతుంది ఇంకా సేవింగ్స్ డబ్బు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి, ఆరోగ్య బీమా తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితులను ముందుగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు.


Click it and Unblock the Notifications