For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలకు రూ.3,000తో రూ.1 కోటి ఆదాయం రావాలంటే ఎంత సమయం పడుతుంది?

|

స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక స్పష్టమైన లక్ష్యంతో పెట్టుబడులు పెట్టాలి. మన లక్ష్యం, ఇందుకు కావాల్సిన మొత్తం, ఎంతకాలం పడుతుంది, మనం ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ ఎంత అనే అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పిల్లల చదువులు లేదా ఇల్లు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు లేదా హాలీడే వంటి స్వల్పకాలిక లక్ష్యాల ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా లక్ష్యం లేదా సేవింగ్స్‌కు ముందు ఆదాయం మైనస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఖర్చులు అనే సూత్రాన్ని పాటించాలి. చాలామంది విచ్చలవిడిగా, ఆదాయానికి మించిన ఖర్చు చేస్తారు. ఆ తర్వాత మిగిలితేనే ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఖర్చును సాధ్యమైనంతగా తగ్గించుకొని, పెట్టుబడి ఆలోచనను పెంచుకోవాలి. మొదట ఆదా చేయాలి, ఆ తర్వాత ఖర్చులు చేసుకోవాలి. అయితే ఆదా చేయడానికి ముందు ఖర్చుపై విచ్చలవిడితనం లేకుండా అంచనాకు రావాలి. అప్పుడే ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయి.

12 శాతం రిటర్న్స్‌తో రూ.1 కోటి

12 శాతం రిటర్న్స్‌తో రూ.1 కోటి

ఉదాహరణకు నెలకు రూ.5000 మొత్తం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం వృద్ధి రేటు వేసుకుంటే ఇరవై సంవత్సరాల్లో ఇది రూ.50 లక్షలు అవుతుంది. ఇందులో మీ పెట్టుబడి రూ.12 లక్షలు మాత్రమే. అంటే ప్రతి నెల రూ.5000 చొప్పున ఇరవై సంవత్సరాలు (240 నెలలు) అంటే మొత్తం మీ పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. ఒకవేళ మీ పెట్టుబడిని మీరు రూ.5000 కాకుండా రూ.10,000కు పెంచుకుంటే ఇరవై ఏళ్ల తర్వాత మీకు వచ్చే రాబడి రూ.1 కోటి అవుతుంది.

మరింత కాలపరిమితి పెంచుకుంటే మరింత ఎక్కువ మొత్తం కూడా వస్తుంది. రూ.5,000 మొత్తాన్ని ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే 25 ఏళ్లకు రూ.95 లక్షలు అవుతుంది. పాతికేళ్ల పాటు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే రూ.19 కోట్లు వస్తుంది. ఇక్కడ 12 శాతం వృద్ధిని లెక్కలోకి తీసుకున్న విషయాన్ని గుర్తించాలి.

ఖర్చుల ఆధారంగా

ఖర్చుల ఆధారంగా

మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ పెట్టుబడి లక్ష్యాన్ని, అలాగే పెరిగే మీ పెట్టుబడి లక్ష్యాన్ని, పెరిగే మీ ఖర్చులను, ఆయా కాలానికి తగినట్లుగా అంచనా వేసుకోవడం తప్పనిసరి. ఒకటి ప్రతి ఏడాది ఖర్చులు పెరుగుతుంటాయి. ఇందుకు ధరల పెరుగుదల మొదలు పలు కారణాలు ఉంటాయి. అలాగే ప్రస్తుతం 20 ఏళ్లకు గాను మీ పిల్లల చదువు ఖర్చు రూ.25 లక్షలు అనుకుంటే, పాతికేళ్ల తర్వాత అది రూ.35 లక్షలు, అంతకంటే ఎక్కువ కావొచ్చు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతున్నాయి. అలాగే మన ఆదాయం, ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు, పెట్టుబడి లక్ష్యాన్ని ఎంచుకోవడం ముఖ్యం.

రూ.3000తో రూ.1 కోటి

రూ.3000తో రూ.1 కోటి

మీరు సిప్ ద్వారా ముప్పై సంవత్సరాల కాలపరిమితితో నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ మొత్తం రూ.1 కోటికి పైగా ఉంటుంది. సిప్ పెట్టుబడి ద్వారా కోటీశ్వరుడిగా మారేందుకు ఎంతమొత్తం, ఎంత కాలానికి ఇన్వెస్ట్ చేయవచ్చునో తెలుసుకోవడానికి సిప్ కాలిక్యూలేటర్ ఉపయోగించవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మీరు పెట్టుబడిని ప్రారంభించకుంటే ఇప్పుడే ప్రారంభించండి. పెట్టుబడికి మీరు ఆలస్యం చేసినా కొద్ది మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం పెరుగుతుంది. ఆదాయం ఆర్జిస్తున్న ప్రారంభంలోనే ఇన్వెస్ట్ చేస్తే తక్కువ మొత్తంతో ముందుకు సాగవచ్చు. ఆలస్యం చేస్తే ఎక్కువ ఇన్వెస్ట్ చేయవలసి వస్తుంది.

ఈక్విటీలు దీర్ఘకాలంలో అధిక ద్రవ్యోల్భణం-సర్దుబాటు చేసిన రాబడిని అందించే అవకాశమున్నందున, ఈక్విటీ మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిగణించాలి. అవసరమైతే రెండు మూడు మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌ను ప్రారంభించవచ్చు.

English summary

నెలకు రూ.3,000తో రూ.1 కోటి ఆదాయం రావాలంటే ఎంత సమయం పడుతుంది? | How much will you get after 25 years by investing Rs 10,000 per month

Saving Rs 5,000 every month in equity mutual fund at an assumed growth rate of 12 per cent can grow to about Rs 50 lakh after 20 years.
Story first published: Monday, October 11, 2021, 14:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X