Gold Loan: తులం బంగారం తాకట్టు పెడితే లోన్ ఎంత వస్తుంది..!
బంగారం ధర భారీగా పెరుగుతోంది. తాజాగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.88 పెరిగి రూ.16,397కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాము పుత్తడి ధర రూ. 80 పెరిగి రూ.15,030 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 61 పెరిగి రూ.12,293 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.880 పెరిగి రూ.1,63970 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.800 పెరిగి రూ. 1,50, 300కు చేరింది. ఇక 18 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.610 పెరిగి 1,22,930 వద్ద కొనసాగుతోంది. పసిడి ధర పెరగడంతో పాటు బంగారం రుణాలు కూడా పెరుగుతున్నాయి. బంగారాన్ని ఆపదలో కాపాడే అత్యవసర నిధిగా ఉపయోగిస్తున్నారు.
తక్కువ సమయంలో చేతిలో డబ్బులు ఉండాలంటే బంగారంపై రుణం సరైన మార్గంగా చాలా మంది భావిస్తున్నారు. బంగారం రుణం ఏ విధంగా ఇస్తారు. పసిడి విలువలో ఎంత శాతం వరకు లోన్ వస్తుందో చాలా మందికి తెలియదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు బంగారం విలువ ఆధారంగా పసిడి రుణాలు ఇస్తున్నాయి. బంగారం మార్కెట్ విలువలో కొంత శాతం వరకే రుణాలు ఇస్తాయి. దీనినే లోన్ టు వాల్యూ రేషియో అంటారు. ఉదాహరణకు రూ. 2.5 లక్షల లోపు చిన్న రుణాలకు 85 శాతం వరకు ఎల్‌టీవీ రేషియో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇక రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ అయితే 80 శాతం ఎల్‌టీవీ ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.

సాధారణంగా బంగారం విలువలో 75 శాతం వరకు డబ్బులు ఇస్తారు. దాదాపుగా అందరు ఆభరణాలు తాకట్టు పెట్టి బంగారం రుణాలు తీసుకుంటారు. కాబట్టి ఆభరణాలు 22 క్యారెట్లు ఉంటాయి. ఆభరణాల్లో రాళ్లు, పూసల బరువు తీసేస్తారు. ఆ తర్వాత వచ్చే బంగారాన్ని లెక్కి తీసుకుని లోన్ ఇస్తారు. తులం అంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం తాకట్టు పెట్టారనుకోండి. ప్రస్తుతం తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50, 300 ఉంది. దీనిపై గరిష్ఠ లోన్ విలువ 85 శాతం లోన్ టు వాల్యూ రేషియో ప్రకారం చూసుకుంటే రూ. 1,26,000 వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. సాధారణ రుణం 75 శాతం నుంచి 80 శాతం ఎల్‌టీవీ రేషియోలో అయితే రూ.1,10,000 నుంచి రూ.1,17,000 వరకు లభిస్తుంది.
పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే బంగారం రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది బంగారం రుణాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్భీఎఫ్సీలు బంగారం రుణాలు అందిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications