SBI: ఎస్బీఐ నుంచి అదిరిపోయే పథకం.. రూ.5 లక్షల పెట్టుబడిపై వడ్డీ ఎంతంటే..!
చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్ మెంట్ తర్వాత ఆనందంగా జీవితం గడపాలని చూస్తారు. వారికి రిటైర్డ్ మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వారు కచ్చితమైన, సురక్షితమైన రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతారు. అలాంటి వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం సరిపోతుంది. వివిధ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లై రకరకాల వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. పెద్ద బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని కొనసాగిస్తోంది. అదే అమృత్ వృద్ధి పథకం. ఈ ప్రత్యేక FDకి పెట్టుబడి కాలపరిమితి 444 రోజులు, అంటే 14.5 నెలలు ఉంటుంది.
ఈ పథకంలో సాధారణ పౌరులకు 6.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05% వార్షిక వడ్డీని చెల్లిస్తోంది. ఈ పథకం హామీతో కూడిన రాబడి ఇస్తోంది. అంతాకేకాకుండా 444 రోజులు పూర్తికాకముందే మీకు డబ్బు అవసరమైతే మీరు మీ FDని గడువుకు ముందే మూసివేయవచ్చు. అయితే బ్యాంకు నిబంధనల ప్రకారం దీనికి జరిమానాలు విధిస్తారు. రూ.5 లక్షల వరకు ఉన్న డిపాజిట్లపై 0.50% జరిమానా, రూ.5 లక్షల నుంచి రూ.3 కోట్ల మధ్య ఉన్న డిపాజిట్లపై 1 శాతం ఫైన్ విధిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన 7 రోజులలోపు FDని మూసివేస్తే వడ్డీ చెల్లించరు. బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఎఫ్డీని గడువుకు ముందే మూసివేసినందుకు విధించే జరిమానా నుంచి మినహాయింపు ఉంటుంది.

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకు వెళ్లాల్సిన అవసరం లేదు. అర్హులైన కస్టమర్లు SBI YONO యాప్ ద్వారా లేదా SBI అధికారిక ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించి అమృత్ వృద్ధి పథకం కింద FDని తెరవవచ్చు. ఇందులో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే సాధారణ పౌరులకు 40,472 వడ్డీతో కలిపి మొత్తం 5,40,472 వస్తాయి. సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం వడ్డీ చెల్లిస్తారు కాబట్టి వారికి వచ్చే మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఎస్బీఐలో ఇదే పథకం కాకుండా వివిధ కాలపరిమితుల ఎఫ్డీలు ఉన్నాయి.
సాధారణ FD కాలపరిమితులలో రెండు నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై ప్రస్తుతం అత్యధికంగాసాధారణ కస్టమర్లకు 6.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. 7-45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 3.05 శాతం, 46-179 రోజుల కాలపరిమితిపై 4.90 శాతం, 180-210 రోజుల డిపాజిట్లపై 5.65 శాతం, 211 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 5.90 శాతం వడ్డీని SBI అందిస్తోంది. ఒకటి నుండి రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ లభిస్తుండగా, మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 6.30% వడ్డీ లభిస్తుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications