సాధారణంగా చాలామందికి అత్యవసరంగా రుణం కావాల్సి వచ్చినప్పుడు పర్సనల్ లోన్ వైపు చూస్తారు. తదుపరి చూపు గోల్డ్ లోన్. బంగారం పైన ఇచ్చే రుణాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. అత్యవసర సమయంలో బంగారం రుణం పొందడం ఇతర మార్గాల కంటే చాలా సులభం. బ్యాంకు ఖాతా ఉంటే బ్యాంకులు వేగంగా గోల్డ్ లోన్ మంజూరు చేస్తాయి. వివిధ బ్యాంకుల్లో వివిధ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఉన్నాయి.

ముందే తెలుసుకోవాలి
వివిధ బ్యాంకులు బంగారంపై రుణాన్ని దాని వ్యాల్యూ ఆధారంగా ఇస్తాయి. బహిరంగ మార్కెట్ కంటే బ్యాంకుల్లో రుణ వడ్డీ రేటు తక్కువ. అత్యవసర రుణం కోసం గోల్డ్ లోన్ మంచి ఎంపిక. బంగారంపై రుణాలు ఇచ్చే బ్యాంకులు 7.39 శాతం నుండి వడ్డీ రేటును ప్రారంభిస్తున్నాయి. సెక్యూర్డ్ లోన్ కాబట్టి క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ రుణం లభిస్తుంది. సాధారణంగా బంగారం రుణాలలో తాకట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ వ్యాల్యూలో 75 శాతం వరకు రుణ సంస్థలు రుణాన్ని ఇస్తున్నాయి. రుణం ఎంత వస్తుంది, వడ్డీ వివరాలు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు, లేట్ ఫీజు వంటి వాటి గురించి ముందే తెలుసుకోవాలి.

బ్యాంకును బట్టి రుణం
రుణ చెల్లింపుల్లో ఆలస్యం, ఛార్జీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం చేస్తే
రీపేమెంట్‌లో ఆలస్యం కారణంగా అదనపు ఛార్జీ, బంగారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బంగారం రుణాల వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారుతాయి.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు
ఫెడరల్ బ్యాంకు ఏడాది కాలానికి వడ్డీ రేటు 7.39 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు 7.40 శాతం, ఎస్బీఐ 7.40 శాతం, HDFC బ్యాంకు 7.55 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 7.65 శాతం, కెనరా బ్యాంకు 7.65 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.40 శాతం, కర్నాటక బ్యాంకు 8.49 శాతం, ఇండియన్ బ్యాంకు 8.50 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 8.85 శాతం, యూనియన్ బ్యాంకు 9 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 9.40 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 10 శాతం, యాక్సిస్ బ్యాంకు 14 శాతం అందిస్తున్నాయి.
ఎన్బీఎఫ్‌సీల విషయానికి వస్తే మణప్పురం 9.90 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 10 శాతం, ముథూట్ ఫైనాన్స్ 11.90 శాతం ఉన్నాయి.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications