స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి అనిశ్చిత సమయాల్లో ఇన్వెస్టర్లు తరచుగా ఆందోళనకు గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే పెట్టుబడి అనేది ఉత్కంఠభరితంగా ఉండాల్సిన అవసరం లేదు; అది ఒక పద్ధతి ప్రకారం సాగితేనే సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్ ఎండి , సీఈఓ రాధికా గుప్తా సూచించిన 65-10-10-15 లేదా 'బోరింగ్ థాలీ' (Boring Thali) వ్యూహం ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఏంటి ఈ 'బోరింగ్ థాలీ' వ్యూహం?
మనం భోజనం చేసే థాలీలో అన్నం, పప్పు, కూర, పెరుగు ఎలాగైతే సమతుల్యంగా ఉంటాయో.. మన పెట్టుబడి కూడా అలాగే ఉండాలనేది ఈ వ్యూహం సారాంశం.
- 65% ఈక్విటీ (Equity): మీ పెట్టుబడిలో ఎక్కువ భాగం షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) లో ఉండాలి. ఇందులో లార్జ్-క్యాప్ , మిడ్-క్యాప్ ఫండ్స్ కలయిక ఉండటం వల్ల స్థిరత్వంతో పాటు వృద్ధి కూడా లభిస్తుంది.
- 10% బంగారం (Gold): మార్కెట్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరిగి మీ పోర్ట్‌ఫోలియోను కాపాడతాయి.
- 10% వెండి (Silver): ఇది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, పారిశ్రామికంగా కూడా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది.
- 15% డెట్ లేదా ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ (Debt): ఇది మీ పెట్టుబడికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది, స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది.
ఈ వ్యూహం ఎందుకు పని చేస్తుంది?
చాలా మంది ఇన్వెస్టర్లు ఏదైనా రంగం బాగా పెరుగుతుంటే ఆ పరుగులో వెనకబడిపోతామేమో (FOMO) అని కంగారు పడి ఎక్కువ డబ్బు పెడుతుంటారు. కానీ ఈ 'బోరింగ్ థాలీ' విధానంలో మీరు ముందుగానే కేటాయింపులు (Allocation) చేసుకుంటారు. కాబట్టి మార్కెట్ పెరిగినా తగ్గినా మీరు ప్రశాంతంగా ఉండవచ్చు.
- మల్టీ-అసెట్ బెనిఫిట్: ఒక అసెట్ క్లాస్ (ఉదాహరణకు ఈక్విటీ) నష్టాల్లో ఉన్నప్పుడు.. మరొకటి (బంగారం లేదా డెట్) ఆ నష్టాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.
- ఎమోషనల్ ఇన్వెస్టింగ్ కు చెక్: మార్కెట్ హెడ్ లైన్స్ చూసి భయపడి షేర్లు అమ్మేయడం లేదా ఆవేశంగా కొనడం వంటి పొరపాట్లు జరగకుండా ఈ క్రమశిక్షణతో కూడిన ప్లాన్ మిమ్మల్ని కాపాడుతుంది.
రాధికా గుప్తా ఏమంటున్నారు?
"ముందుగా మార్కెట్ ఎలా ఉంటుందో అంచనాలు వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా 65-10-10-15 స్ట్రక్చర్ పాటించండి" అని రాధికా గుప్తా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈక్విటీ విభాగంలో లార్జ్ , మిడ్ క్యాప్ పోర్ట్‌ఫోలియోతో పాటు, తగిన సమయంలో కొన్ని థీమాటిక్ ఫండ్స్ లో చిన్న కేటాయింపులు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎవరికి ఇది సరిపోతుంది?
ఎవరైతే మార్కెట్ హెచ్చుతగ్గులను చూసి రాత్రిళ్లు నిద్రపోలేరో, ఎవరికైతే దీర్ఘకాలంలో స్థిరమైన సంపద కావాలని కోరుకుంటారో వారికి ఈ వ్యూహం చక్కగా సరిపోతుంది. ఇది రాత్రికి రాత్రే మీ డబ్బును డబుల్ చేయకపోవచ్చు. కానీ, ఏడాది పొడవునా మీ పెట్టుబడిని సురక్షితంగా ఉంచుతూ మంచి రాబడులను అందిస్తుంది.
మొత్తంగాగా చెప్పాలంటే పెట్టుబడి అనేది ఒక రేసు కాదు. అది ఒక ప్రయాణం. ప్రశాంతంగా, పద్ధతిగా మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) లేదా ఇతర ఆస్తుల్లో పెట్టుబడి పెట్టేవారే చివరికి విజేతలుగా నిలుస్తారు.
More From GoodReturns

EMI ట్రాప్‌లో పడకుండా ఐఫోన్ కొనడం ఎలా? నిపుణుల బెస్ట్ టిప్స్!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. రూ.11 లక్షల కోట్లు ఆవిరి.. సెన్సెక్స్ 1,800 పాయింట్లు డౌన్

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

వార్ దెబ్బకు కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..



Click it and Unblock the Notifications