ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో కలిసి హౌసింగ్ ప్రైసింగ్ ఇండెక్స్ (HPI)ను ప్రారంభించింది. దీనిని మే 31, 2021 రోజున లాంచ్ చేసింది. ఇది ఇంటి కొనుగోలుదారులకు ఇంటి అసెస్‌మెంట్ కోసం ఎంతో ప్రయోజనకరం. అదే సమయంలో అమ్మకందారులకు కూడా తన అసెట్స్ విక్రయించడానికి ఉపయోగపడుతుంది.
ధరల కదలికలకు సంబంధించి డేటాను అందించడం ద్వారా కొనుగోలుదారులు తగిన సమయంలో ఇంటిని కొనుగోలు చేయడానికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది. అలాగే ఇంటిని విక్రయించేవారికి ఏ ధరకు, ఏ సమయంలో విక్రయించాలో నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ధోరణులు తెలుసుకుని తగిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి విధానకర్తలకు, ఫైనాన్షియల్ విశ్లేషకులకు దోహదం చేయనుంది.

కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా దీనిని ప్రారంభించారు. ఇళ్ల ధరలు, క్రయ, విక్రయాలు జరిగిన ఇళ్ల సంఖ్య మొదలైన వివరాలను ప్రతి నెల HPI అందిస్తుంది. హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ NCRలలోని ఇళ్ల ధరలు తెలుసుకోవడానికి ఈ సూచీ ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications