రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను ఈ దఫా కూడా స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో హోమ్ లోన్ సహా వివిధ రుణాల వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. అమెరికా సహా వివిధ దేశాల్లో అక్కడి కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను క్రమంగా పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచనుంది. ఇప్పటికే వివిధ దేశాలు వడ్డీ రేట్లను పెంచాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కూడా పెంచవచ్చునని భావించారు. కానీ కీలక వడ్డీ రేట్లలై యథాస్థితిని కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ వడ్డీ రేట్లు మరింత కాలం అలాగే ఉంటాయి.

హోమ్ లోన్ వడ్డీ రేట్లు
ప్రస్తుతం ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....
Union Bank of India - 6.40%
Bank of Baroda - 6.50%
Kotak Mahindra Bank - 6.55%
HDFC - 6.70%
ICICI Bank - 6.70%
Citibank - 6.75%
State Bank of India - 6.75%
LIC Housing Finance - 6.90%
Axis Bank - 6.90%

పదేళ్ల కనిష్టం వద్ద
ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేట్లు పదేళ్ల కనిష్టం వద్ద ఉన్నాయి. వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో హౌసింగ్ సేల్స్ డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రియాల్టీ సంస్థలు చెబుతున్నాయి. రెపో రేటు ప్రస్తుతం 4 శాతంగా ఉంది. ఆయా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపో రేటుతో అనుసంధానించిన నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచకూడదని బ్యాంకులు కూడా నిర్ణయించుకుంటాయి. ఇది అంతిమంగా హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రాథమికంగా ఆయా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచకుంటే హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా స్థిరంగా ఉంటాయి.

హోమ్ లోన్ వడ్డీ రేట్లు
ప్రస్తుతం ఆయా బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి....
Union Bank of India - 6.40%
Bank of Baroda - 6.50%
Kotak Mahindra Bank - 6.55%
HDFC - 6.70%
ICICI Bank - 6.70%
Citibank - 6.75%
State Bank of India - 6.75%
LIC Housing Finance - 6.90%
Axis Bank - 6.90%

ఈ స్టాక్స్ జంప్
హోమ్ లోన్ వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో హోమ్ లోన్స్‌కు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల స్టాక్స్ పరుగు పెడుతోంది. మధ్యాహ్నం గం.3 సమయానికి ఏ స్టాక్ ఎంత ఉందంటే..
Repco Home Finance - 5.27%
Aavas Financiers - 3.51%
Housing Development Finance Corp - 1.87%
PNB Housing Finance - 1.12%
GIC Housing Finance - 1.34%
Can Fin Homes - 2.00%
Cholamandalam Housing Finance - 1.14%


Click it and Unblock the Notifications