ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..రూ. 60 లక్షల హోమ్ లోన్‌పై రూ. 19 లక్షలు ఆదా చేసుకోవచ్చు

ఇంటిని కొనుగోలు చేయాలనే కల చాలా మందికి జీవితంలో పెద్ద లక్ష్యం. కానీ, ఆ కలను నెరవేర్చే గృహ రుణం (Home Loan) మన భవిష్యత్తులో భారీ ఆర్థిక భారం అవుతుంది. వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉండటం వల్ల రుణగ్రహీతలు తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని EMIల రూపంలో కోల్పోతారు. అయితే ఒక చిన్న ఆర్థిక వ్యూహం మార్పుతో ఎటువంటి అదనపు చెల్లింపు లేకుండానే..రుణ కాలాన్ని సంవత్సరాల మేరకు తగ్గించుకోవడం, కోట్ల రూపాయల వడ్డీని ఆదా చేయడం సాధ్యమవుతుందని TaxBuddy.com వ్యవస్థాపకుడు సుజిత్ బంగర్ ఒక ఉదాహరణ ద్వారా చూపించారు.

సుజిత్ బంగర్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఇద్దరు రుణగ్రహీతలను ఉదాహరణలుగా పోల్చారు. వారి పేర్లు సురేష్, రమేష్. ఇద్దరూ రూ. 60 లక్షల Home Loan తీసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య వ్యూహంలో చిన్న తేడా, చివరికి వడ్డీ చెల్లింపులలో భారీ తేడాను సృష్టించింది.రమేష్ సాధారణ పద్ధతినే అనుసరించాడు. తన రూ. 8 లక్షల పొదుపును సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచి, సగటున 2.5 శాతం వడ్డీ పొందుతూ, తన EMIలను సాధారణంగా చెల్లించాడు. 20 సంవత్సరాల తర్వాత అతను దాదాపు రూ. 65 లక్షల వడ్డీని చెల్లించాడు. అంటే ఇది రుణ మొత్తం కంటే ఎక్కువ.

home loan tips home loan tricks home loan repayment prepayment strategy loan prepayment India EMI reduction tips how to save on home loan interest mortgage hacks India save lakhs on home loan best home loan repayment plan personal finance India financial planning 2025 early loan closure home loan calculator interest savings EMI strategy SBI home loan tips HDFC home loan savings ICICI loan repayment tricks smart borrower India 2025

ఇక సురేష్ మాత్రం తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అతను హోమ్ లోన్ OD (Overdraft-linked Home Loan) లేదా సూపర్ సేవర్ అకౌంట్ ఎంచుకున్నాడు. ఈ పద్ధతిలో రుణానికి అనుబంధమైన ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్‌లో తన రూ. 8 లక్షలను జమ చేశాడు.దీని వల్ల అతని వడ్డీ లెక్కించే ప్రిన్సిపల్ రూ. 60 లక్షల బదులుగా రూ. 52 లక్షలకే పరిమితమైంది. EMI మాత్రం అదే ఉంది. కానీ ప్రతిరోజూ వడ్డీ లెక్కింపు తక్కువ ప్రిన్సిపల్‌పై జరుగుతుంది. ఫలితంగా, సురేష్ సమర్థవంతంగా 9 శాతం రాబడి పొందినట్లే అయింది. ఎందుకంటే అతని డబ్బు వడ్డీ వ్యయాన్ని తగ్గించింది.

ఈ తెలివైన వ్యూహం వల్ల సురేష్ తన రుణాన్ని 20 సంవత్సరాల బదులు కేవలం 14 సంవత్సరాల్లో ముగించగలిగాడు. అంతేకాదు అతను మొత్తం రూ. 19.25 లక్షల వడ్డీని ఆదా చేశాడు. ముఖ్యంగా, తన రూ. 8 లక్షల మీద పూర్తి లిక్విడిటీ (withdrawal access) కూడా కొనసాగింది. సుజిత్ బంగర్ చెప్పినట్లుగా ప్రతి రూపాయి మీరు జమ చేసే ప్రతిసారి, అది మీ రోజువారీ వడ్డీని తగ్గిస్తుంది. మీరు అవసరమైనప్పుడు ఆ డబ్బును తిరిగి తీసుకోవచ్చు కూడా.

ఇలాంటి OD లింక్డ్ హోమ్ లోన్‌లకు సాధారణంగా 0.25 శాతం నుండి 0.5శాతం ఎక్కువ వడ్డీ రేటు ఉండొచ్చు. కానీ రోజువారీ వడ్డీ లెక్కింపు ప్రిన్సిపల్ తగ్గడం వల్ల లభించే వాస్తవ ప్రయోజనం ఈ తేడా కంటే చాలా ఎక్కువ.ఇది మీ లిక్విడ్ క్యాష్ మేనేజ్‌మెంట్‌కు రివార్డ్ ఇచ్చే రుణం అని బంగర్ వ్యాఖ్యానించారు.

ఎందుకు ఇది తెలివైన వ్యూహం

1. పొదుపుపై అధిక లాభం: సేవింగ్స్ అకౌంట్‌లో 2.5% మాత్రమే పొందే డబ్బు ఇప్పుడు 9% రాబడిలా పనిచేస్తుంది.
2. రుణ కాలం తగ్గుతుంది: వడ్డీ తగ్గడం వల్ల EMI ప్రిన్సిపల్ రీపేమెంట్ వేగవంతమవుతుంది.
3. లిక్విడిటీ కొనసాగుతుంది: అవసరమైనప్పుడు జమ చేసిన నిధులను తిరిగి ఉపసంహరించుకోవచ్చు.
4. EMI మారదు నెలవారీ బాదరబందీ అదే ఉండగా, మొత్తం వడ్డీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

ఎవరికీ సరిపోతుంది

స్థిరమైన ఆదాయం కలిగిన ఉద్యోగులు
వ్యాపారవేత్తలు లేదా ఫ్రీలాన్సర్లు, వీరికి మధ్య మధ్యలో పెద్ద మొత్తాలు అందుతుంటాయి
తాత్కాలికంగా అదనపు నిధులు చేతిలో ఉండేవారు

సురేష్ ఉదాహరణ మనకు ఏం చెబుతోందంటే.. చిన్న వ్యూహాత్మక మార్పు భారీ ఆర్థిక ఫలితాలను తీసుకువస్తుంది. హోమ్ లోన్ OD ఖాతా, సరైన రీతిలో ఉపయోగిస్తే, EMIలను తగ్గించకుండానే రుణ కాలాన్ని కుదించడానికి, లక్షల రూపాయల వడ్డీని ఆదా చేయడానికి శక్తివంతమైన సాధనంగా చెప్పవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+