ఈ మూడింటికి ఫైవ్ స్టార్ రేటింగ్, ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రిటర్న్స్!
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ద్వారా రాబడిని లేదా ఫండ్ హిస్టారికల్ రికార్డును అంచనా వేయడానికి మ్యూచువల్ ఫండ్ రేటింగ్‌ను చూడటం సహజం. పెట్టుబడిదారులు రిస్క్, భవిష్యత్తు రిటర్న్స్ పొందగలసామర్థ్యం... ఈ రెండింటి పైన స్పష్టమైన అవగాహన కోసం రేటింగ్‌పైన ఆధారపడతారు. మ్యూచువల్ ఫండ్స్‌కు రేటింగ్‌ను వివిధ రేటింగ్ ఏజెన్సీలు కేటాయిస్తాయి. CRISIL, ICRA, మార్నింగ్ స్టార్, వ్యాల్యూ రీసెర్చ్ వంటి సంస్థలు ఈ రేటింగ్‌ను ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్ రేటింగ్స్ ద్వారా మాత్రమే కచ్చితంగా ఎంచుకునే అవకాశం ఉంటుందని చెప్పలేం. కానీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, మనకు అనుకూలంగా ఉండే ఫండ్‌ను ఎంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. తద్వారా మన పర్సనల్ ఫైనాన్స్ గోల్స్ చేరుకోచ్చు. ఈ నేపథ్యంలో వ్యాల్యూ రీసెర్చ్, మార్నింగ్ స్టార్ నుండి నాలుగు లేదా ఐదు రేటింగ్ అందుకున్న కొన్ని స్టాక్స్...

యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్
యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ బ్లూచిప్ ఫండ్ కేటగిరీ. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైనప్పటి నుండి ఇది మంచి రిటర్న్స్ అందించింది. గత ఏడాది ఇది 40.14 శాతం రిటర్న్స్ ఇచ్చింది. వ్యాల్యూ రీసెర్చ్ ప్రకారం ఇది సగటున ప్రతి ఏడాది 16.80 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఫైనాన్షియల్స్, టెక్నాలజీ, సర్వీసెస్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇన్ఫోసిస్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, బజాజ్ పైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అవెన్యూ సూపర్ మార్ట్ టాప్ ఫైవ్ హోల్డింగ్స్. ఈ ఫండ్ రూ.28,233 కోట్ల AMU కలిగి ఉంది.

కెనరా రోబికో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
కెనరా రోబికో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ 2013లో ప్రారంభమైంది. మార్నింగ్ స్టార్ నుండి 5 స్టార్ రేటింగ్ వచ్చింది. వ్యాల్యూ రీసెర్చ్ కూడా 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. కెనరా రోబికో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ రిటర్న్స్ గత ఏడాది 59.88 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఫైనాన్షియల్, ఆటోమొబైల్స్, హెల్త్ కేర్, టెక్నాలజీ, కెమికల్ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. టాప్ హోల్డింగ్స్‌లో HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

నిప్పోన్ ఇండియా షార్ట్ టర్మ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్
నిప్పోన్ ఇండియా షార్ట్ టర్మ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ షార్ట్ టర్మ్ డ్యురేషన్ మ్యూచువల్ ఫండ్ స్కీం. ఇది జనవరి 2013లో నిప్పోన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్రారంభమైంది. నిప్పోన్ ఇండియా షార్ట్ టర్మ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఏడాది రిటర్న్స్ 6.42 శాతంగా ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి సగటున 8.79 శాతం రిటర్న్స్ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, రిటర్న్స్ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయి. దీని ఆధారంగా మాత్రమే పెట్టుబడులు సరికావు. నిపుణుల సలహాలు తీసుకొని, అన్నీ పరిశీలించి పెట్టుబడులు పెట్టాలి.


Click it and Unblock the Notifications